మనకు తెలిసిన పండ్లు చాలా తక్కువ. ఇక వాటిలో తినే పండ్లు ఇంకా తక్కువ. తరచుగా అరటి పండ్లు, జామ, దానిమ్మ, ఆపిల్... ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు. కానీ ప్రపంచంలో ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్రెడ్ ఫ్రూట్. చూడడానికి పనసకాయలా కనిపిస్తుంది. కానీ ఈ పండుకు, నిమ్మకాయకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రతిచోటా దొరకదు. దీని రుచి చాలా భిన్నంగా ఉంటుంది. బ్రెడ్‌ను కాల్చుకొని తింటే ఎలా ఉంటుందో, దీని రుచి కూడా అలానే ఉంటుంది. అందుకే దీనికి బ్రెడ్ ఫ్రూట్ అని పేరు పెట్టారు. ఇది మొదటిసారి దక్షిణ పసిఫిక్ దీవుల్లో కనిపించింది. ఇది ఒక ఉష్ణ మండల పండు. అంటే వేడిగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, వీటిని అధికంగా తింటారు. మిగతా చోట్ల ఇది కనిపించే అవకాశం చాలా తక్కువ. దీనిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే బంగాళాదుంపతో దీన్ని పోలుస్తారు. 


ఈ పండు తింటే కొందరికి చిలగడదుంప తిన్నట్టు కూడా అనిపిస్తుంది. ఈ పండు త్వరగా పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. అందుకే దీని పూర్తి భోజనంతో పోలుస్తారు. అక్కడి స్థానికులు రొట్టె, బియ్యం, గోధుమలు వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఈ పండును తినవచ్చు. వాటిని తింటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ పండు తిన్నా కూడా అలాగే ఉంటుంది. దీనిలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ.


ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే అధిక పీచు మలబద్దకాన్ని నయం చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ పండు తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అందుకే ఈ పండు తింటే స్థిరంగా శక్తి విడుదల అవుతూ ఉంటుంది. కాబట్టి నీరసం రాదు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ బ్రెడ్ ఫ్రూట్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఈ పండుగ తమ ఆహారంలో చేర్చుకుంటే మంచిది. 



Also read: ఉదయం టీతో పాటు రస్కులు కూడా తింటున్నారా? అదెంత అనారోగ్యకరమో తెలుసా


Also read: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యూషన్లో ఫ్రెంచ్ ఫ్రైస్‌ను పది సెకన్లలో కనిపెట్టండి


























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.