ఆప్టికల్ ఇల్యుషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పరిశీలనా నైపుణ్యాలకు ఇవి పరీక్ష. మీ మెదడు శక్తిని పరీక్షించడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం ఇది. ఇక్కడ మీకు ఇచ్చిన ఫోటోలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిలో ఓ మూల ఫ్రెంచ్ ఫ్రైలు కూడా ఇరుక్కున్నాయి. వాటిని కనిపెట్టడమే  మీ ముందున్న సవాలు. ఎక్కువ సమయాన్ని ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం మూడు నుంచి పది సెకన్లలోనే వాటిని కనిపెట్టాలి. అప్పుడే మీరు చాలా తెలివైన వారని, మీలో పరిశీలనా శక్తి అధికంగా ఉందని, మీ మెదడు చురుగ్గా పనిచేస్తుందని అర్థమవుతుంది. ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌ను పదిమంది మేధావుల్లో ఒక్కరు మాత్రమే ఛేదించగలిగారు. కాబట్టి మీరు ఎంత సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్‌ను కనిపెట్టగలరో ఓసారి ప్రయత్నించి చూడండి. 


జవాబు ఇది...
పది సెకన్లలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా ప్రయత్నిస్తున్న వారికి ఒక హింట్... ఫ్రెంచ్ ఫ్రైస్ ఫోటోలో కాస్త కిందన ఉన్నాయి. వాటిని కనిపెట్టడంలో విఫలమైన వారికి మేమే జవాబు చెప్పేస్తున్నాం. కింద ఇచ్చిన ఫోటోలో సర్కిల్ చుట్టిన చోటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. వాటిని పది సెకన్లలోపు కనిపెడితే మీరు చాలా మేధావుల కిందే లెక్క. 




ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త  ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు.  విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.  ఆప్టికల్ ఇల్యూషన్లను ఈ ఇన్ స్టా ఖాతాలో అధికంగా ఉంటాయి చూడండి.




Also read: ఈ ఆరు అలవాట్లు ఉంటే పిల్లలను కనడం కష్టమైపోతుంది



Also read: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకోండి























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.