Stock Market Opening 12 June 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్లు పెరిగి 18,594 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 96 పాయింట్లు తగ్గి 62,722 వద్ద కొనసాగుతున్నాయి. గో ఫ్యాషన్, జొమాటో, ఐఈఎక్స్ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,625 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,625 వద్ద మొదలైంది. 62,615 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,783 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 96 పాయింట్ల లాభంతో 62,722 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,563 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,595 వద్ద ఓపెనైంది. 18,559 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 31 పాయింట్లు పెరిగి 18,594 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ఉదయం 44,035 వద్ద మొదలైంది. 43,921 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 7 పాయింట్లు పెరిగి 43,996 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. టైటాన్, ఎల్‌టీ, ఏసియన్ పెయింట్, దివిస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సెమ్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎక్కువ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,450గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.74,౩00 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.25,560 వద్ద ఉంది.
Also Read: ఇండియానే తురుంఖాన్ - అమెరికా, చైనా బలాదూర్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.