చిన్న పిల్లలు చాక్లెట్స్, బిస్కెట్స్ వంటి తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎంత నీయంత్రించినా కూడా వాళ్ళు తినడం ఆపరు. కానీ అతిగా చక్కెర తినడం వల్ల మధుమేహం వస్తుందని అపోహ పడతారు. కానీ నిజానికి చక్కెర తింటే మధుమేహం వస్తుందనేది నిజం కాదు. కానీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే.. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మధుమేహం బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 422 మిలియన్ల మంది దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


చక్కెర తింటే రాదు కానీ..


మన పిల్లలు అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న.. ఏం తిన్నారు? జంక్ ఫుడ్, చక్కెరతో కూడిన పానీయాలు తాగారా అని అడుగుతారు. టైప్ 1 డయాబెటిస్ చక్కెరతో సంబంధం లేకుండా వస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ తయారు చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనికి ఖచ్చితమైన కారణం తెలియదు. అలాగే నిరోధించడానికి మార్గం లేదు.


ఇక టైప్ 2 డయాబెటిస్ బరువు పెరగడానికి సంబంధించినది. ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా ఇతర అనారోగ్య ఆహారాలు, చక్కెర తినని పిల్లలు కూడా టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బరువు పెరిగినప్పుడు. టైప్ 2 డయాబెటిస్ కు అనారోగ్య బరువు కారణం అయ్యే అవకాశం ఉంది.


మధుమేహం రకాలు


చాలా మందికి కేవలం రెండు రకాల మధుమేహాల గురించి మాత్రమే తెలుసు. ఇంకొకటి కూడా ఉంది. అది పిల్లలని ప్రభావితం చేస్తుంది. ఇంతకముందు దాన్ని జువైనల్ డయాబెటిస్ అంటారు.  ఇప్పుడు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటున్నారు. కానీ పిల్లలు టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చేస్తారు.


మరో నాలుగు కొత్త రకాల మధుమేహం



  • మెచ్యూరిటీ ఆన్ సెట్ డయాబెటిస్ యువతలో కనిపిస్తుంది

  • స్టెరాయిడ్ ప్రేరిత మధుమేహం

  • సిస్టిక్ ఫైబ్రోసిస్ సంబంధిత మధుమేహం

  • టైప్ 1.5 మధుమేహం


మధుమేహం వంశపారపర్యమా?


మధుమేహం తల్లి దండ్రులకు ఉంటే పిల్లలకి వస్తుందని నమ్ముతారు. నిపుణులు కూడా జన్యుశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్తారు. అయితే అది మధుమేహం రకం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు లేదో అనేది తీసుకునే ఆహారం, బరువు నిర్ణయిస్తాయి.


పిల్లలకు చక్కెర అతిగా పెడుతున్నారా?


పిల్లలు తినే చక్కెర మొత్తం కాలక్రమేణా రక్తంలో చక్కెర పెరుగుదలకు దారి తీస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకత, ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అతిగా చక్కెర తీసుకోవడం వల్ల పిల్లల మానసిక స్థితి, హైపర్ యాక్టివిటీ ని కూడా ప్రభావితం చేస్తుంది. వారి ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వారి బ్లడ్ షుగర్ లేవల్స్ అప్ అండ్ డౌన్ గా ఉంటాయి. పండ్లు, తృణధన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తుల్లో చక్కెర ఉన్నప్పటికీ అది శరీరానికి హాని చేయదు. ఇవి సహజ చక్కెరలు. పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడతాయి.


టైప్ 2 డయాబెటిస్ ఉన్న పిల్లలు వీటికి దూరంగా ఉండాలి


☀ సోడా, ఇతర తీపి పానీయాలు


☀ చిప్స్, కుకీలు, ఇతర అనారోగ్యకరమైన స్నాక్స్


☀ వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా


☀ జంక్ ఫుడ్


☀ కొవ్వు ఉండే రెడ్ మీట్


☀ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు


మధుమేహాన్ని నయం చేయొచ్చా?


టైప 1 డయాబెటిస్ కి చికిత్స లేదు. అయితే ఆరోగ్యకరమైన జీవినశైలితో టైప్ 2 డయాబెటిస్ ని తిప్పికొట్టవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బరువు అదుపులో ఉంచుకుంటే టైప్ 2 డయాబెటిస్ ని రివర్స్ చేసేందుకు సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: షాకింగ్ - మహిళ మెదడు, చర్మం పొరల్లో పురుగులు - ఇలాంటివి తింటే మీకు ఆ సమస్య రావచ్చు!