'నాటు నాటు' (Naatu Naatu Song) పాటకు ఆస్కార్ అవార్డు (Oscars 2023 Award) వచ్చే వరకు ఎక్కడ చూసినా ఆ పాట గురించి జోరుగా డిస్కషన్ జరిగేది. ఆస్కార్ వస్తుందా? లేదా? అని చర్చలు సాగాయి. ఆ అవార్డు వచ్చిన తర్వాత, ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) చిత్ర బృందం అంతా మన దేశానికి చేరుకున్న కొన్ని రోజులకు పాట మరుగున పడింది. ఇంతకు ముందు వినిపించినంత ఎక్కువగా పాట వినిపించడం లేదు. అలాగని, 'నాటు నాటు...' ఫీవర్ ఏం తగ్గలేదు. 


అమెరికాలోని బేస్ బాల్ లీగ్...
'నాటు నాటు...'కు మస్కట్స్ స్టెప్!
'నాటు నాటు...' పాటకు ఉన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ కింద ఉన్న వీడియో ఒక ఉదాహరణ. అది అమెరికాలోని స్టేడియం! బేస్ బాల్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో మస్కట్స్ 'నాటు నాటు...' పాటకు స్టెప్పులు వేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


లోకల్ టు గ్లోబల్...
లోకల్ పాటగా సూపర్ హిట్ అయిన 'నాటు నాటు...' ఇప్పుడు గ్లోబల్ స్థాయికి వెళ్లి, విజయం సాధించిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 'నాటు నాటు...' సాంగ్ ప్లే చేయడంతో బేస్ బాల్ గేమ్ మరింత ఆసక్తిగా మారిందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. 


'నాటు నాటు...' పాటకు సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రముఖులు సైతం కాలు కదుపుతున్నారు. సినిమా విడుదలకు ముందు ముంబైలో జరిగిన ఓ వేడుకలో హీరో హీరోయిన్లతో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ స్టెప్ వేశారు. రేసింగ్  ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో పాటు రామ్ చరణ్ సరదాగా స్టెప్ వేశారు. 


Also Read  మొగుళ్ళు బాధలే 'సేవ్ ద టైగర్స్' - 'భార్యల నుంచి కాపాడుకుందాం' అంటున్న ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ






ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg)కు సైతం 'నాటు నాటు...' పాట నచ్చింది. ఆయన మాత్రమే ఆ పాట నచ్చిన జనాల్లో చాలా మంది సినిమా ప్రముఖులు ఉన్నారు. ఆస్కార్స్ వేడుక పూర్తి కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్... 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అంతా ఎప్పుడో హైదరాబాద్ చేరుకున్నారు. ఎవరి సినిమా పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. 


ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ (Shankar Director)తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేయనున్న సినిమా స్క్రిప్ట్ పనుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బిజీ అయ్యారు. 'నాటు నాటు...'కు వచ్చిన ఆస్కార్ అవార్డు ఈ ముగ్గురి తదుపరి సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల దృష్టి పడేలా చేసింది. 


Also Read దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్