బరువు తగ్గడం అంటే అంత సులభమైన పనేమి కాదు. అందుకు చాలా శ్రమపడాల్సి వస్తుంది. మనకి ఇష్టమైన ఫుడ్ తినకుండా నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. జిమ్ కి వెళ్ళి వ్యాయామం చేస్తుంటే మనం తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు తగ్గాలని మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా కొన్ని పదార్థాలు తింటూ ఉంటాము. అయితే బరువు తగ్గడంతో పాటు రుచికరమైన ఫుడ్ తినాలంటే కచ్చితంగా సీ ఫుడ్ మన డైట్ లో భాగం చేసుకోవాలి. చేపలు, స్కాలోప్స్ వంటి సీ ఫుడ్ తినడం వల్ల తక్కువ కేలరీలు లభించడంతో పాటు ప్రోటీన్స్ కూడా అందుతాయి. 


తక్కువ ప్రోటీన్స్ ఉండే పదార్థాల జాబితాలో చేపలకి మొదటి స్థానం ఇవ్వాలిసిందే. మంచి రుచికరమైన ఆహారమే కాదు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మీ ఆకలిని తీర్చడమే కాకుండా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అయితే కొవ్వు తక్కువ ఉండే చేపలను తినడం ఉత్తమం. ఇందులో కేలరీలు(ప్రోటీన్ రిచ్ ఫుడ్) తక్కువగా ఉంటాయి. బరువు తగ్గేందుకు సీ ఫుడ్ తినాలని అనుకున్నప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చెయ్యకండి.


 బటర్ వద్దు 


వంటకాల్లో వెన్న చేర్చడం వల్ల ఆ ఆహారానికి అదనపు రుచి వస్తుంది. కానీ చేపల విషయంలో మాత్రం అది అస్సలు ఉపయోగించొద్దు. చేపలతో చేసే వంటకానికి బటర్ జోడిస్తే మీ బరువు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు బరువు తగ్గేందుకు చేపలు తినాలని అనుకుంటే ఈ తప్పు మాత్రం అస్సలు చెయ్యొద్దు. బటర్ తో చేసిన చేపల వంటకాలు నోటికి రుచిగా ఉంటాయి కానీ మీ బరువు తగ్గే లక్ష్యం మాత్రం ఆటకెక్కినట్లే. బటర్ కి బదులుగా ఆలివ్ ఆయిల్ జోడించుకోవడం ఉత్తమం. 


చేపల వేపుడు అసలే వద్దు 


బరువు తగ్గాలనుకుంటే వేపుళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంతా మంచిది. అవి చేసేందుకు ఎక్కువగా మసాలా, నూనె ఉపయోగించడం వల్ల అందులో బరువు పెరిగేండూ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏదైనా సీ ఫుడ్ తినాలనుకున్నపుడు వాటిని ఫ్రై మాత్రం చేసుకుని తినడం చెయ్యొద్దు. 


ఫ్యాటీ ఫిష్ అనే అపోహ 


సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. కానీ ఇవి బరువు తగ్గేందుకు మంచి ఎంపికలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఆకలిని తగ్గించడంలో దోహదపడతాయని అంటున్నారు. ఇది మెదడు, గుండెకి చాలా మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Also read: రోజూ ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారికి వాళ్లకు షాకింగ్ న్యూస్, అలా కూర్చుంటే ఈ గుండె సమస్యలు తప్పవు


Also read: ఆ ఊరికి అల్లుడిగా వెళతారా? కట్నంగా ఏమిస్తారో తెలిస్తే చచ్చినా వెళ్లరు