ఆ తెగలోని అమ్మాయిలు అందంగా ఉంటారు. అందంగా ఉన్నారు కదా అని ఆశ పడితే అల్లుడిగా మారతారు. అల్లుడిగా మారితే మీకు 21 బహుమానాలు అత్తింటి నుంచి వస్తాయి. బహుమానాలనగానే బైక్, కారు, బంగారాలు, స్థలాలు అనుకుంటున్నారా? కాదు, పాములు. ఆ ఇంటి పిల్లతో పాటూ పాములను తెచ్చుకోవాల్సిందే. అది అత్యంత విషపూరితమైన పాములు. ఇది వింతగా అనిపించినా నిజం. మాకు పాములొద్దు అంటే వదిలేస్తారనుకుంటున్నారా? బలవంతంగా ఇచ్చి మరీ ఇంటికి పంపిస్తారు. వాటితో పాటూ కాస్త బంగారం, డబ్బులు కూడా ఇస్తారు. పాపం అమ్మాయి కోసం ఆశ పడితే పాముల సంప్రదాయం మాత్రం అరాచకం. 


ఇంతకీ ఎక్కడా?
మధ్యప్రదేశ్లోని గౌరియా తెగలో ఈ వింత ఆచారం ఉంది. గత శతాబ్ధాలుగా ఈ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. ఆ తెగలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మిగతా తెగల అబ్బాయిలు భయపడతారు. అందుకే దాదాపు సొంత తెగలోనే సంబంధాలు వెతుక్కుంటారు. అందుకే వారిచ్చే పాములు కూడా అదే గూడెంలో తిరుగుతుంటాయి. పెళ్లి సెటిల్ అయిన వెంటనే పాముల కోసం వేట మొదలుపెడతారు. వాటిని పట్టి ముందుగానే భద్రపరుస్తారు. పాములు తీసుకోమని అల్లుడు మొరాయిస్తే పెళ్లినే క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే పాములను కట్నంగా ఇవ్వకపోతే ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవదని వారి నమ్మకం. అంతేకాదు కట్నంగా తీసుకున్న పాములను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అత్తింటివారిదే. వాటిలో ఏదైనా మరణిస్తే చాలా అశుభంగా భావించి పెళ్లి నిలిపివేస్తారు. రెండు కుటుంబాల వారు గుండు కొట్టించుకుంటారు.


భయం లేదా?
ఈ తెగ వారికి పాములు పట్టడం చాలా సులువు. వారి జీవనోపాధి కూడా అదే. కాబట్టి పాములను చూసి భయపడే వాళ్లు తక్కువ మంది. పాములను ఆడించడం ద్వారా డబ్బు సంపాదించి బతుకుతారు. కాబట్టి వారికి పాములు కట్నంగా ఇవ్వడం అనేది చాలా సాధారణ అంశం. పాములనే కట్నం ఎందుకివ్వాలి? అంటే ఆ పాములతోనే జీవనోపాధి పొందమని ఆడపిల్ల తండ్రి అల్లుడికి చెప్పడమన్నమాట.ఆ పాములను జనాల మధ్య ఆడిస్తూ డబ్బు సంపాదించుకోమని వారి ఉద్దేశం. వీరంతా రకరకాల ప్రాంతాలకు వలస వెళ్లిపోతారు. అక్కడ పాములను ఆడిస్తూ జీవనం గడుపుతారు. వీటిని బుట్టల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వారిదే. అవి బావున్నంత కాలం వీరి జీవితం కూడా బావుంటుందని వీరికి అపారనమ్మకం. 


Also read: చిటికెలో చికెన్ దోశ, చినుకుల్లో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు


Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే