చీజ్ పిజ్జా... అబ్బా ఆ రుచే వేరు. ఇక బర్గర్ మధ్యలో నిండుగ చీజ్ చల్లి పైన బ్రెడ్ పెట్టి తింటుంటే పొట్ట నిండిపోతుంది. చీజ్ వాడకం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఇంట్లోని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు చీజ్ బాల్స్, చీజ్ సాండ్ విచ్ అంటూ రకరకాల వంటకాలు చేసుకుని తినేస్తున్నారు. ఏమైనా అంటే అది పాల ఉత్పత్తే కదా? బోలెడంత కాల్షియం లభిస్తుంది కదా అంటారు. నిజమే కానీ అతిగా తినడం వల్ల మాత్రం చీజ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి. 


అది నేచురల్ కాదు
చాలా మంది చీజ్ నేచురల్ ఆహారాల్లో ఒకటి అనుకుంటారు. కానీ కాదు. చీజ్ లో బోవిన్, గ్రోత్ హార్మోన్ వంటి కృత్రిమ పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా శరీరంలో చేరడం వల్ల ఆరోగ్యానికి హానికరం, దీర్ఘకాలికంగా తినడం వల్ల చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. 


డీహైడ్రేషన్ 
తగినంత నీరు శరీరంలో చేరకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. చీజ్ ఉండే పదార్థాలు అధిక సోడియాన్ని కలిగి ఉంటాయి. ఇవి చాలా హానికరం. చీజ్ లో ఉండే అధిక సోడియం వల్ల హైబీపీ వస్తుంది.దీని వల్ల డీ హైడ్రేషన్ సమస్య మొదలవుతుంది.  


గ్యాస్ట్రిక్ సమస్యలు
కొందరిలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉంటుంది. వీరు పాల ఉత్పత్తలును అధికంగా అరిగించుకోలేరు. ఇలాంటి సమస్య తమకు ఉందని కూడా చాలా మందికి తెలియదు. వారికి చీజ్ లో ఉండే లాక్టోజ్ అరగక చాలా గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. పొట్ట గ్యాస్‌తో ఉబ్బిపోతుంది.  


కొలెస్ట్రాల్
చీజ్‌లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. చీజ్ తక్కువగా తింటే పెద్దగా శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. కానీ అధికంగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్ సరఫరాకు ఆటంకం కలుగుతంది. దీని వల్ల తీవ్ర సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 


అధిక బరువు
చాలా మంది చీజ్‌ను తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్ ఉండే ఆహారంగా భావిస్తారు. అందుకే దీన్ని ఆమ్లెట్, శాండ్ విచ్, సలాడ్... ఇలా ప్రతి ఆహారానికి జోడిస్తుంటారు. నిజానికి ఇది బరువును పెంచుతుంది. మీరు బరువు తగ్గే ప్రయత్నం చేస్తుంటే చీజ్ ను దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. 


Also read: పొట్ట ఆరోగ్యానికి బీరు మంచిదేనంట, చెబుతున్న కొత్త అధ్యయనం


 Also read: పన్నెండు కిలోల ఆ బంగారు నాణెం ఎక్కడుంది? ఎందుకు మనదేశం దాని కోసం వెతుకుతోంది?