దోశకు ఫ్యాన్స్ ఎక్కువ. మసాలా దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ... ఇలా చాలా తిని ఉంటారు కదా. ఇప్పుడు చికెన్ దోశ తిని చూడండి. రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి తింటే మీరే మీరే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. చేయడం కూడా చాలా సులువు. మసాలా దోశలాగే ముందుగా కూర వండుకుని, తరువాత దోశపై వేసుకుని తినడమే.
కావాల్సినవిదోశ పిండి - ఒక కప్పుచికెన్ ముక్కలు - అరకప్పుఉల్లిపాయ తరుగు - పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూనుపచ్చిమిర్చి తరుగు - ఒక స్పూనుమిరియాల పొడి - పావు టీస్పూనుకారం - అర టీస్పూనుగరం మసాలా - అర టీస్పూనుటమోటా ప్యూరీ - ఒక స్పూనుకరివేపాకులు - ఒక రెమ్మజీలకర్ర - అర టీస్పూనుఉప్పు - రుచికి సరిపడానెయ్యి - సరిపడినంతకొత్తిమీర తరుగు - ఒక టీస్పూను
తయారీ ఇలా1. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. ఆ నూనెలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. 2. అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ కూడా వేసి వేయించాలి. కరివేపాకులు కూడా వేసి కలపాలి. 3. అన్నీ బాగా వేగాక కారం, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర తరుగు, ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. 4. అన్నీ వేగాక అరకప్పు నీళ్లు వేయాలి. నీల్లు సలసల కాగుతున్నప్పుడు చికెన్ ముక్కులు వేసి కలపాలి. 5. చికెన్ ముక్కల్లో ఎముకలు లేకుండా చూసుకోవాలి. అలాగే చికెన్ దోశ కోసం చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 6. చిన్నమంట మీద ముక్కలు ఉడికేలా ఉడికించాలి. చికెన్ మిశ్రమం చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. 7. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. నూనె వేడెక్కాక దోశ పిండితో దోశ పోయాలి. 8. దోశ పైన చికెన్ మిశ్రమం పరవాలి. 9. అయిదునిమిషాలు దోశెను వేగనిస్తే చికెన్ దోశ రెడీ. దీనికి ఏ చట్నీ అవసరం లేదు. చికెన్ మిశ్రమంతోనే దోశెను తినేయచ్చు.వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరు.
Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే