రెడ్‌మీ కే50ఐ 5జీ అంటుటు స్కోరును రెడ్‌మీ ఇండియా షేర్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 13 స్కోరును కూడా దాటేసింది. రెడ్‌మీ కే50ఐ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 20వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్‌లో రెడ్‌మీ కే50ఐ 5జీ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


రెడ్‌మీ ట్విట్టర్‌లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం అంటుటు బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లో రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్ 8,22,274 పాయింట్లను సాధించింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 8,04,131 పాయింట్లను, ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్ 7,82,653 పాయింట్లను స్కోర్ చేసింది.


ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌లో 5 కోర్ జీపీయూని అందించారు. రెడ్‌మీ కే50ఐ 5జీ స్కోరును బట్టి చూస్తే ఐఫోన్ 13 ప్రో కంటే ఇది పవర్‌ఫుల్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ క్వాలిటీ గురించి మాత్రం లాంచ్ అయ్యాక ఉపయోగిస్తేనే మాట్లాడగలం. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌పై రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది.


రెడ్‌మీ కే50ఐ మనదేశంలో జులై 20వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. రెడ్‌మీ నోట్ 11టీ ప్రోకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ను రెడ్‌మీ కే50ఐలో అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ సేల్ జులై 22వ తేదీన జరగనుంది.


క్విక్ సిల్వర్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ కే50ఐ 5జీ ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వీటిలో బేస్ వేరియంట్ ధర రూ.24,000 నుంచి రూ.28,000 మధ్య ఉండనుందని, హైఎండ్ వేరియంట్ ధర రూ.29,000 నుంచి రూ.33,000 మధ్య ఉండనుందని తెలుస్తోంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!