ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ల లాంచ్‌ను కంపెనీ టీజ్ చేసింది. జులై 19వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. మనదేశ కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మార్కెట్లోకి దించనుంది.


ఐకూ 10 సిరీస్ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీ ఈ విషయాన్ని కన్పర్మ్ చేసింది. కానీ ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కచ్చితమైన సంగతి తెలియరాలేదు.


ఐకూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీబోలో షేర్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుందని ఈ పోస్టర్‌లోనే కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్‌లో ఐకూ 10, ఐకూ 10 ప్రో రెండు ఫోన్లు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం... వీటిలో ఒక ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండనుంది. ఇది ఐకూ 10 ప్రో మోడలా? లేకపోతే ఐకూ 10 స్మార్ట్ ఫోనా? అన్నది మాత్రం తెలియలేదు.


ఐకూ 10 వెనకవైపు డిజైన్ గురించి మాత్రం లీకులు వచ్చాయి. వెనకవైపు డిజైన్ డ్యూయల్ టోన్‌తో రానుంది. వీటిలో ఒక వేరియంట్‌కు వెనకవైపు అరామిడ్ ఫైబర్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. ఐకూ ఫ్లాగ్ షిప్ సిరీస్ తరహాలో ఇందులో కూడా గింబల్ స్టెబిలైజేషన్ ఉండనుంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ విషయానికి వస్తే... దీంతో మొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీగా షావోమీ నిలిచింది. షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఈ ప్రాసెసర్‌ను అందించారు. షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, షావోమీ 12ఎస్ అల్ట్రా స్మార్ట్ ఫోన్లలో ఈ ప్రాసెసర్‌ను అందించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!