టెక్నో స్పార్క్ 8పీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


టెక్నో స్పార్క్ 8పీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. అట్లాంటిక్ బ్లూ, ఐరిస్ పర్పుల్, టహిటి గోల్డ్, టర్కోయిస్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


టెక్నో స్పార్క్ 8పీ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ 8టీ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డీటీఎస్ సరౌండ్ సౌండ్ ఉన్న స్పీకర్లు ఇందులో ఉన్నాయి. స్ప్లాష్ రెసిస్టెంట్ బిల్డ్‌తో ఈ ఫోన్ రూపొందించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!