రోజుకో యాపిల్ తింటే వైద్యుని అవసరమే ఉండదు, రెండు యాపిల్స్ తింటే ఎంతో ఆరోగ్యం... మరి అంతకుమించి తింటే కచ్చితంగా రకరకాల ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. అందుకే అంటారు అతి అనర్థానికి దారితీస్తుందని. ఆపిల్ పండ్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ పండ్లు మంచివి కదా అని కొంతమంది రోజులో అయిదారు తినేస్తు ఉంటారు. అలాగే కొన్ని రోజుల పాటూ కంటిన్యూ చేస్తే కచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్లాల్సి వస్తుంది.
రోజుకు ఎన్ని తినచ్చు?
రోజుకో ఆపిల్ పండు తింటే ఎంతో మంచిది. నిజానికి అది చాలు కూడా. కొంతమంది రెండు పండ్లు తింటారు. అది కూడా మంచిదే. అంతకు మించి తింటేనే సమస్యలు మొదలవుతాయి.
అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే...
1. ఆపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ చాలా అధికంగా ఆపిల్స్ లోని ఫైబర్ శరీరంలో చేరడం వల్ల పొట్ట ఉబ్బరం, మలబద్ధకం ఏర్పడుతుంది. రోజుకు 20 నుంచి 40 గ్రాముల ఫైబర్ అవసరం. 70 గ్రాములకు మించి శరీరంలో చేరితో జీర్ణ సమస్యలు మొదలవుతాయి.
2. షుగర్ వ్యాధిగ్రస్తులు ఒకటి లేదా రెండు పండ్లు వరకు తినవచ్చు. అంతకుమించి తింటే సమస్యల మొదలవుతుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కానీ అధికంగా యాపిల్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని దెబ్బతీస్తుంది.
3. అత్యధిక పురుగుమందుల అవశేషాదలు కలిగి ఉన్న పండ్ల జాబితాలో ఆపిల్ పండ్లు ముందు స్థానంలో ఉంటాయి. వాటిని నిల్వ ఉంచేందుకు కూడా కొన్ని రకాల రసాయనాలు వాడతారు. డైఫెనిలామైన అనేది సాధారణంగా ఈ పండ్లలో వాడే ఒక పురుగుమందు. ఒకేరోజు అధికంగా పండ్లు తినడం వల్ల అధికంగా ఆ పురుగుమందును తిన్నట్టే.
4. ఆపిల్ ఒకటి లేదా రెండుకు మించి తినడం వల్ల అధికంగా కార్బో హైడ్రేట్లు శరీరంలో చేరుతాయి. వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు.
5. ఆపిల్ పండ్లలో ఆమ్లశాతం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం వల్ల సోడాల కంటే అధిక స్థాయిలో ఇది దంతాలను దెబ్బతీస్తుంది.
6. కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఆపిల్ పండ్లకు దూరంగా ఉండడం మంచిది. ఇవి వారిలో జీర్ణం కావడం కష్టంగా మారుతుంది.
Also read: సత్యనాదెళ్ల కొడుకును బలితీసుకున్న సెరెబ్రల్ పాల్సీ, ఇదో భయంకరమైన వ్యాధి
Also read: భారత పాస్‌పోర్టు ఉంటే చాలు, ఈ దేశాల్లో వీసా లేకుండా హ్యాపీగా తిరిగేయచ్చు