జంక్ ఫుడ్ అధికంగా తినడం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇవే కాదు సమయానికి తినకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవడంతో  పాటు మరెన్నో కారణాల వల్ల ఊబకాయం సమస్యని ఎదుర్కొంటున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాల పరాక్రమ యునైటెడ్ స్టేట్స్ లో దాదాపు 35శాతం కంటే ఎక్కువ మంది అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.


ఊబకాయానికి కారణాలు


ఇంతక ముందు వంశపారపర్యంగా ఒబేసిటీ వచ్చేది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం అలా కాదు, పెద్ద వాళ్ళే కాకుండా చిన్న వయసులో ఉన్న పిల్లలు కూడా అధికంగా ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్, పిండి పదార్థాలు, సరైన వ్యాయామం లేకపోవడం వంటివి సాధారణంగా ఒబేసిటీకి దోహదపడే కారణాలు అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవే కాదు, తగినంత నీరు తాగకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా ఊబకాయానికి ప్రధాన సమస్యలుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఒబేసిటీకి ఉప్పు ఏ విధంగా కారణం


పెద్ద మొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలోని నీటిని హరించి వేస్తుంది. ఇది దీర్ఘకాలిక రక్తపోటు సమస్యతో పాటు గుండె జబ్బులకి కారణం అవుతుంది. శరీరంలో బరువు పెరగడానికి దోహదపడుతుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహరంలో టేబుల్ సాల్ట్ రుచిని పెంచుతుంది. 40 శాతం సోడియంతో తయారు చేయబడి ఉంటుంది. పోషకాహార నిపుణుల లెక్క ప్రకారం సగటున రోజు వారీ మొత్తం మీద 2300 మిల్లీ గ్రాముల ఉప్పు లేదా ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, రక్తపోటు ఎక్కువ కావడానికి కారణం అవుతుంది. ఇది శరీరంలో అవసరం లేని ద్రవాలని మూత్రపిండాలు విసర్జించేలా చెయ్యడం కష్టం చేస్తుంది. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల దాహం ఎక్కువగా అనిపిస్తుంది. శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అయినట్టుగా నిపిస్తుంది.


డీహైడ్రేషన్ హానికరమైన ప్రభావాలు


ఉప్పగా ఉండే ఆహారాలు డీ హైడ్రేషన్ కి దారి తీస్తాయి. ఇది ఫ్రక్టోజ్, కొవ్వు ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే సాల్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే దాహాన్ని కలిగిస్తుంది. ఇది శరీరంలో ఉండే నీటిని లాగేసుకుంటుంది. దీని వల్ల చర్మం పొడి బారిపోయి దురదగా అనిపిస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు త్వరగా అలిసిపోయేలా చేస్తుంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: రోజులో 23 గంటలు బెడ్ మీదే, ఏం తిన్నా వాంతులే - ఈమెకు వచ్చిన వింత వ్యాధి ఏమిటో తెలుసా?


Also Read: పచ్చి అల్లం VS సొంటి పొడి, ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలేమిటీ?