చాక్లెట్స్ అంటే ఇష్టంలేనివారు ఎవరుంటారు చెప్పండి. తియ్యగా, క్రిమీగా ఉండే చాక్లెట్‌ను అలా నోటిలో పెట్టుకోగానే కరిగిపోతుంది. మనసు ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే, ఇప్పటికే చాలా అధ్యయనాలు చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనని స్పష్టం చేశాయి. చాక్లెట్ హార్ట్‌కు కూడా మేలు చేస్తుందని పరిశోధకులు చెప్పారు. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అది తెలిస్తే ఎగిరి గంతేస్తారేమో, అదేంటో చూసేయండి.
చిగుళ్లకు మంచిదే
చాక్లెట్లు తినడం వల్ల మీ దంతాల చిగుళ్లకు కూడా మేలు జరుగుతుందటే నమ్ముతారా? సాధారణంగా చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్లు పుచ్చుపోతాయని అంటారు. కానీ, తాజా అధ్యయనం మాత్రం చాక్లెట్లు తినడం వల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. ఔనండి, మీరు విన్నది కరక్టే. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయట. డార్క్ చాక్లెట్‌లో ఉండే కోకోబీన్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చిగుళ్లకు మేలు చేయవచ్చని పేర్కొన్నారు. సుమారు 50 శాతం వరకు చాక్లెట్లు చిగుళ్లకు మేలు చేయొచ్చని చెప్పారు. అయితే, సుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చాక్లెట్లు తింటే మాత్రం మొదటికి మోసం వస్తుంది. అవి దంతాలను తినేస్తాయి. దంతక్షయం ఏర్పడి.. భవిష్యత్తులో చాక్లెట్లను చూస్తేనే భయపడే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి, చాక్లెట్లు మంచివే కదా అని అదే పనిగా తినొద్దు. ఒక వేళ తినాలి అనిపిస్తే.. డార్క్ చాక్లెట్లు తినండి.
చిగుళ్లకు ఏవీ మేలు? ఏవి మంచివి కాదు?
అధిక సుగర్ లేదా సాల్ట్ కంటెంట్ ఉన్న ఆహారాలేవీ చిగుళ్ల ఆరోగ్యానికి మంచివి కాదు. చీజ్ చిగుళ్లకు మంచిదే. అలాగే తక్కువ ఉప్పు కలిపిన వేరే శనగలు కూడా మేలు చేస్తాయి. ఉడకబెట్టిన లేదా వేపిన శనగలైతే బెస్ట్. ఫిల్టర్ కాఫీలు, తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాలు చిగుళ్లకు మంచివి కాదు. చెక్లెట్, చీజ్ 54 శాతం వరకు చిగుళ్లకు మేలు కలిగిస్తాయి. వేరు శనగలై 71 శాతం వరకు మంచివి. మనం డైలీ తినే రైస్ వల్ల కూడా చిగుళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కనీసం 58 శాతం వరకు మేలు జరుగుతుంది. ఫిల్టర్ కాఫీ వల్ల 42 శాతం, తక్కువ క్యాలరీలు కలిగిన పానీయాల వల్ల చిగుళ్లకు 57 శాతం వరకు నష్టం కలగవచ్చని చైనాలోని చాంగ్‌కింగ్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి.. పై వాటిలో మీ చిగుళ్లకు మేలు చేసే ఆహారాన్నే ఇకపై ఎంచుకోండి.
Also Read: ఆ ఫాస్టింగ్తో 21 రోజులలో 13 కిలోలు తగ్గాడట.. నిజంగానే బరువు తగ్గుతారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.