Water Fasting Benefits : బరువు తగ్గాలనే ఆలోచనతో చాలామంది వివిధ ఫాస్టింగ్​లు, డైటింగ్​లు ఎంచుకుంటున్నారు. అలా వచ్చిన ఓ ఫాస్టింగ్​తో ఓ వ్యక్తి 21 రోజులలో 13 కిలోలు తగ్గినట్లు చెప్పాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆ ఫాస్టింగ్​తో నిజంగానే బరువు తగ్గుతారా? ఏ వయసు వారు చేయొచ్చు? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇంతకీ ఈ ఫాస్టింగ్ పట్ల నిపుణులు ఇచ్చే సలహాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్రూట్ ఫాస్టింగ్ అంటే కేవలం ఫ్రూట్స్ ఎలా తీసుకుంటామో.. వాటర్ ఫాస్టింగ్​ అంటే కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలి. అవును కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ ఈ ఫాస్టింగ్ చేయాలి. అలా అని లిక్విడ్స్​ ఏమైనా తీసుకోవచ్చా అంటే.. కచ్చితంగా నో అంటున్నారు. అన్నం, ఇతర ఫుడ్ తీసుకోవడంతో పాటు.. ఇతర పానీయాలకు దూరంగా ఉండడమే వాటర్ ఫాస్టింగ్. కోస్టారికాకు చెందిన అడిస్ మిల్లర్ ఈ ఫాస్టింగ్​తోనే బరువు తగ్గినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్​గా మారింది. 


వాటర్ ఫాస్టింగ్​ను 21 రోజులు చేసి.. అడిస్ మిల్లర్ 13 కిలోల బరువు తగ్గినట్లు ఓ వీడియోలో పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్​లో షేర్ చేసుకున్నాడు. దానిని ఏ విధంగా చేశాడో.. అతని శ్రమకి ఫలితం ఎలా దక్కిందో వీడియోలో వివరించాడు. ఈ జర్నీ అతను ఎదుర్కొన్న సవాళ్లు, బెనిఫిట్స్​ను తెలిపాడు. ఈ ఫాస్టింగ్​లో భాగంగా రోజుకు నాలుగు లీటర్లు తాగినట్లు తెలిపాడు. కానీ దీనిని స్టార్ట్ చేసినప్పుడు స్కిన్ డ్రైగా మారిపోవడం, ఎనర్జీ తగ్గిపోవడం వంటి వాటిని ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. 


ఆ ఫాస్టింగ్​తో కలిగే లాభాలు ఇవే


ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు శరీరం క్లియర్ అవ్వడంతో పాటు.. బలహీనంగా మారుతున్నట్లు గుర్తించామని మిల్లర్ చెప్పాడు. నడిచేందుకు కూడా కష్టపడ్డట్లు తెలిపాడు. రెండోవారం ముగిసే సమయానికి కాస్త ఎనర్జీ వచ్చినట్లు తెలిపాడు. 19వ రోజుకి శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ.. మానసికంగా దృఢంగా మారినట్లు వెల్లడించాడు. ఈ ఫాస్టింగ్ వల్ల వాసన, వినికిడి, జ్ఞాపకశక్తి వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపాడు. 



ఫాస్టింగ్ వల్ల కలిగే నష్టాలు


వాటర్ ఫాస్టింగ్ చేస్తే మంచిదే కానీ ఎక్కువ కాలం చేస్తే మరెన్నో నష్టాలు కలిగి ఉంటాయని తెలిపారు నిపుణులు. దీనివల్ల కండరాలు బలహీనంగా మారడం, పోషకాల లోపం, డీ హైడ్రేషన్, జీర్ణ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చెప్తున్నారు. ఈ తరహా ఫాస్టింగ్ చేసేప్పుపుడు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలంటున్నారు. 



ఆ సమస్యలుంటే చేయొద్దు..


కొన్ని ఫాస్టింగ్​లకు వయోపరిమితి ఉంటుంది. అలాగే ఈ ఫాస్టింగ్​ను చిన్నవయసు వారు ట్రై చేయకూడదట. బరువు తక్కువగా ఉండేవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. గుండె సమస్యలున్నా, డయాబెటిస్ ఉన్నా.. దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా.. రక్తహీనత సమస్యలున్నవారు.. వివిధ ఆరోగ్య సమస్యలతో మెడిసిన్స్ తీసుకునేవారు ఈ ఫాస్టింగ్​ చేయొద్దని చెప్తున్నారు. 


Also Read : వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఆ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలట








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.