Kalki 2898 AD World Wide Box Office Collections: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఇప్పటికీ పలు థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అందుకే ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఓ రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ముందే ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తాయని అంచనా వేశారు ఇండస్ట్రీ నిపుణులు. ఇక టాక్ బాగుంటే ఆ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఇక వారు చెప్పినట్టే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను టచ్ చేయడానికి దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా తమ సోషల్ మీడియాలో ప్రకటించారు.


మేకర్స్ సంతోషం..


‘కల్కి 2898 ఏడీ’ విడుదలయిన 11 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. 10వ రోజు ఈ మూవీ రూ.41.3 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్‌తో పోలిస్తే సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగాయని తెలుస్తోంది. కేవలం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 10 రోజుల్లోనే రూ.465.70 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది ‘కల్కి 2898 ఏడీ’. దేశవ్యాప్తంగా రూ.507 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ వీకెండ్‌లోనే ‘కల్కి 2898 ఏడీ’.. రూ.700 కోట్ల మార్క్‌ను టచ్ చేసిందని ప్రకటించిన మేకర్స్.. రెండో వీకెండ్ పూర్తి అవ్వకముందే రూ.900 కోట్లు కలెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.






నార్త్ అమెరికా రికార్డ్..


ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ జోరు మామూలుగా లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ మూవీ కలెక్షన్స్ గురించి మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు నార్త్ అమెరికా కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉన్నారు. నార్త్ అమెరికాలో ‘బాహుబలి 2’ తర్వాత ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’ అని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఇక తాజాగా వారు చేసిన పోస్ట్ ప్రకారం నార్త్ అమెరికాలో ఈ మూవీ 16 మిలియన్ల కలెక్షన్స్ సాధించింది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ కౌంట్ మరింత పెరగనుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







Also Read: ఆ విజువల్స్‌ చూస్తుంటే కళ్లు చెదిరిపోయాయ్, పార్ట్‌ 2 కోసం వెయిటింగ్ - కల్కి 2898 AD మూవీపై మృణాల్