Dussehra Special Outfit Ideas : మరికొద్ది రోజుల్లో దసరా వచ్చేస్తుంది. అమ్మవారిని ఎలాగో అందంగా ముస్తాబు చేస్తాము. మరి మనం కూడా అందంగా రెడీ అవ్వాలిగా. అయితే ఇప్పటినుంచే షాపింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. కానీ ఎలాంటి డ్రెస్​లు వేసుకోవాలి అనేదానిపై మీకు ఇంకా క్లారిటీ రాలేదంటే ఇది మీకోసమే. ఈ పండుగ సమయంలో.. ట్రెండ్​కి తగ్గట్లు ట్రెడీషనల్​గా కనిపించేందుకు ఎలాంటి డ్రెస్​లు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


పండుగలకు, అమ్మాయిలకు విడదీయరాని బంధముంటుంది. పూజలు చేయడంలో.. బుట్టబొమ్మల్లాగా అందంగా రెడీ అవ్వడంలో వారికి వారే సాటి. అయితే దసరా సమయంలో ట్రెండీగా.. అలాగే సాంప్రదాయంగా కనిపించేందుకు ఎలాంటి ఆభరణాలు ధరించాలో.. ఎలాంటి డ్రెస్​లు వేసుకోవాలో, ఎలాంటి రంగులు ఎంచుకోవాలో అని గాభార పడిపోకండి. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోయి.. పండుగ స్ట్రెస్​ను తగ్గించేసుకోండి.  


చీరకు డిజైనర్ బ్లౌజ్..


మీరు ట్రెండీగా, సాంప్రదాయంగా కనిపించాలనుకుంటే కచ్చితంగా మీ లిస్ట్​లో చీర ఉండాలి. చీర అనేది ఎలాంటి ఫంక్షన్​కైనా నిండుదనాన్ని తీసుకువస్తుంది. అయితే మీరు సింపుల్​ చీరను ఎంచుకున్నా సరే.. దానికి డిజైనర్​ బ్లౌజ్ సెట్ అప్ చేసుకోండి. ఇది మీకు డిఫరెంట్ వైబ్​ను ఇస్తుంది. లేదంటే మీరు మీకు నచ్చిన టీషర్ట్​ని కూడా బ్లౌజ్​లాగా సెట్​ చేసుకోవచ్చు. లేదంటే స్లీవ్ లెస్ బ్లౌజ్ ఎంచుకోవచ్చు. దానికి పెద్ద జుంకాలు, చిన్న చైన్, పాపిడి బిళ్ల బాగా సెట్ అవుతాయి. 


అనార్కలీ..


మీకు చీరతో ఇబ్బంది ఉంటే.. లేదంటే అటు ఇటూ తిరిగేందుకు సౌకర్యంగా ఉండాలనుకుంటే మీరు అనార్కలీ డ్రెస్​లు ఎంచుకోవచ్చు. దానిలో మీరు గోల్డెన్ కలర్ డ్రెస్ ఎంచుకుంటే చాలు. పండుగ లుక్​ అంతా మీ దగ్గరే ఉంటుంది. మీ లుక్​ని మరింత ఎలివేట్ చేసుకునేందుకు బ్రోకేడ్ లేదా బెనారెస్ దుపట్టాలు జత చేసుకోవచ్చు. 


గోల్డెన్​ థీమ్​తో వెళ్లాలి అనుకుంటే.. నెక్లెస్, పెద్ద జుమ్కాలు, చంకీ బ్రాస్​లెట్​లు, వాచీ, గోల్డెన్ యాక్సెసరీలతో లేయర్ చేసుకోవచ్చు. గోల్డెన్ స్ట్రాపీ హీల్స్​ కూడా మీ లుక్​కి మరింత అందాన్ని జోడిస్తాయి. 


లెహంగా మంచి ఎంపిక..


లెహంగాలు కేవలం పెళ్లిళ్ల సమయంలో వేసుకుంటారు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఫంక్షన్​కైనా లెహంగాలు మంచి ఎంపిక. ఒకప్పుడు గాగ్రా చోళీలే ఇప్పటి లెహంగాలు అని చెప్పవచ్చు. ట్రెండ్​కు తగ్గట్లు లెహంగాలు డిజైన్ చేసుకుని మీ ఔట్​ఫిట్​ లుక్​ డిసైడ్ చేసుకోవచ్చు. 


జరీ థ్రెడ్ వర్క్, బ్రోకెడ్ డిజైన్లు పండుగ సమయానికి చక్కగా నప్పుతాయి. వీటిలో ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బ్లాక్, మెరూన్ రంగుల డ్రెస్​లు ఎంచుకోవచ్చు. వీటికి మీరు బ్లాక్ గోల్డ్ ఆభరణాలతో సెట్ చేసుకోవచ్చు. లేదంటే డైమండ్స్, పురాతన నగలు కూడా వీటికి బాగా నప్పుతాయి.


ట్రెండీ షరారా..


కొద్దిరోజులుగా షరారా ట్రెండ్ జోరుగా సాగుతోండి. డైలీ రోటీన్​ నుంచి.. ప్రత్యేక రోజుల వరకు ఇది ఓ క్లాసిక్​ లుక్​ను తీసుకువస్తుంది. అంతేకాకుండా రెట్రో వైబ్స్ ఇస్తుంది. డీప్​ హ్యూడ్​ షరారా సెట్​లు ట్రెండ్​కి తగ్గట్లు ఉంటాయి. బోట్​ నెక్​లు, డీప్​ కట్​ ఆర్మ్ హోల్స్, షార్ట్ కుర్తాలు, భారీ ఫ్లేర్స్ ఫెస్టివ్ లుక్​ అందిస్తాయి. వీటిని గోల్డ్ జ్యూవెలరీతో హైలేట్ చేయొచ్చు. 


పలాజో సెట్​లు..


పండుగ సమయంలో ఎలాంటి హంగులు లేకుండా.. సింపుల్​గా, అందంగా కనిపించాలంటే మీరు పలాజో సెట్​లు ఎంచుకోవచ్చు. ఆధునిక స్లిమ్ స్ట్రాప్స్, సున్నితమైన నెక్​లైన్ కలిగిన డ్రెస్​లు మీకు మంచిగా సెట్​ అవుతాయి. వీటికి బుట్టలు పెయిర్​ చేస్తే బాగుంటుంది. చోకర్​తో మీ పండుగ లుక్​ని హైలెట్​ చేసుకోవచ్చు. మినిమల్ మేకప్ మీ లుక్​ని మరింత న్యాచురల్​గా మారుస్తుంది. 


Also Read : సెక్స్​ లైఫ్​పై మధుమేహం ప్రభావం.. మగవారికి ఆ సమస్యలు వచ్చే ఆస్కారం