Hidden Health Risks of Dehydration : చలికాలంలో ప్రజలకు సహజంగానే దాహం తక్కువగా వేస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. చలికాలంలో నీరు తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే.. శరీరంలో అనేక వ్యాధులు ప్రవేశిస్తాయి. శీతాకాలంలో దాహం తక్కువగా వేయడానికి అనేక కారణాలున్నాయి. అయితే ఇది మీరు కావాలని చేసేది కాదు. చలికాలంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల.. శరీరానికి నీటి అవసరం లేదని మన మెదడు భావించేలా చేస్తుంది. దీనివల్ల ప్రజలు చలికాలంలో నీరు తాగడం మానేస్తారు.

Continues below advertisement

దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి?

  • శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చలికాలంలో రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల మెదడులోని దాహం కలిగించే కేంద్రానికి శరీరంలో నీటి కొరత లేదని అనిపిస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చలికాలంలో దాహం 40% వరకు తగ్గుతుంది.
  • శీతాకాలపు గాలి కూడా దాహం తగ్గడానికి ఒక కారణం. చల్లని గాలిని పీల్చినప్పుడు, శరీరం నుంచి వెచ్చని గాలిని బయటకు విడుదల చేస్తాడు. ఇది కూడా శరీరంలో నీటి కొరతకు ప్రధాన కారణం.
  • శీతాకాలంలో మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరించడం వల్ల వచ్చే చెమట త్వరగా ఆవిరైపోతుంది. దీనివల్ల శరీరం నుంచి ఆవిరైపోయే చెమటను మనం అంచనా వేయలేము.
  • శీతాకాలంలో ఇళ్లలో, ఆఫీసుల్లో చాలామంది హీటర్లను ఉపయోగిస్తారు. ఇవి మన శరీరం నుంచి తేమను పీల్చుకుంటాయి. దీనివల్ల మన శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గొంతు పొడిబారడం, నోరు ఎండిపోవడం శరీరంలో నీటి కొరతకు అతిపెద్ద సంకేతాలు.
  • శీతాకాలంలో ఎక్కువమంది టీ, కాఫీలు తాగుతారు. వీటిని తాగడం వల్ల రెండు నిమిషాలు చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ శరీరంలో నెమ్మదిగా నీటి కొరత ఏర్పడుతుంది.

శరీరంలో నీటి కొరత తీవ్రమైన లక్షణాలు

శరీరం పొడిబారడం లేదా దురద, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, ముదురు పసుపు రంగు మూత్రం, పెదవులు పగలడం, అలసట, తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉండటం వంటివి మీ శరీరంలో నీటి కొరత ఉందని సూచిస్తాయి. ఈ లక్షణాలలో ఏదైనా మీ శరీరంలో కనిపిస్తే, వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ప్రారంభించండి. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగడం మంచిదని చెప్తున్నారు. 

Continues below advertisement

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.