Health Benefits with Haldi Drink : పసుపు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే దీనిని డైట్​లో భాగం చేసుకోవాలంటారు. అయితే దీనిని ఉదయాన్నే హెల్తీ డ్రింక్​గా తీసుకుంటే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయంటున్నారు నిపుణులు. పసుపుతో చేసే నీటిని పరగడుపున తాగితే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయంటున్నారు. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 


ఆరోగ్య ప్రయోజనాలు.. 


పసుపుతో చేసే ఈ డ్రింక్​లో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ప్రయోజనాలు చూస్తారు. నొప్పి, మంట దూరమవుతుంది. ఆర్థ్రైటిస్​ని దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణసమస్యను దూరం చేసి గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. 


పసుపులో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. అలాగే సీజనల్ ఇన్​ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తాయి. జలుబు, దగ్గు వంటి వాటిని దూరం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యానికే కాకుండా జుట్టు, స్కిన్​కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. స్కిన్​కు లోపలి నుంచి మంచి గ్లోను అందిస్తాయి. పింపుల్స్ దూరం చేసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు కూడా ఈ డ్రింక్ మంచి బెనిఫిట్స్ అందిస్తుంది. ఒత్తిడి, యాంగ్జైటీ కూడా దీనితో కంట్రోల్ అవుతుంది. 


ఈ డ్రింక్​ని రెగ్యూలర్​గా తీసుకుంటే శరీరం డీటాక్స్ అవుతుంది. బాడీలో ఉన్న టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీనివల్ల శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోదు. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పైగా ఈ డ్రింక్ మంచి ఎనర్జీనిచ్చి మెటబాలీజాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎక్కువసేపు యాక్టివ్​గా ఉంటారు. వర్క్ అవుట్స్ చేసేవారికి ఇది చాలా మంచి బూస్ట్​ని ఇస్తుంది. 


తయారీ విధానం


కప్పు నీళ్లు, అర టీస్పూన్ పసుపు, అల్లం, దాల్చిన చెక్క లేదా తేనెను ఈ డ్రింక్ చేసేందుకు తీసుకోవాలి. స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నీళ్లు వేసి మరిగించాలి. దానిలో పసుపు వేసి.. అల్లం, దాల్చిన చెక్క వేసి మరిగించాలి. దీనిని వడకట్టుకుని తాగాలి. దీనిలో తేనెను కలుపుకోవచ్చు. లేదంటే నిమ్మకాయ రసాన్ని పిండి కూడా ఉదయాన్నే తాగాలి. పరగడుపునే తాగితే మంచి ప్రయోజనాలున్నాయి. 



తీసుకోవాల్సిన జాగ్రత్తలు


మీరు ఈ డ్రింక్​ని ప్రారంభించే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రెగ్నెన్సీతో ఉంటే కచ్చితంగా వెళ్లాలి. ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది కదా అని ఎక్కువగా తాగేయకూడదు. రోజుకు ఒక కప్పు తాగితే సరిపోతుంది. తాగే ముందు తాగిన తర్వాత బ్లడ్ షుగర్ ఎలా ఉందో చెక్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. మీరు కూడా ఈ డ్రింక్​ని రోటీన్​లో చేర్చుకోవాలంటే నిపుణుల సలహా తీసుకుని.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తాగేయండి. 



Also Read : టెన్షన్ తగ్గించుకోండి లేదంటే హార్ట్ ఎటాక్స్ తప్పవట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిపుణుల సలహాలు ఇవే