కూల్ డ్రింక్‌కు అభిమానులు ఎక్కువ. దానిలో వాడే చక్కెర... ఆ వాసన, రుచికి మనల్ని బానిసను చేసుకుంటుంది. అందుకే కూల్ డ్రింక్ చూస్తే చాలు తాగేయాలన్న కోరిక పుడుతుంది. ఇప్పటికి ఎంతోమంది యువత రోజూ డ్రింకులు తాగుతూనే ఉంటారు. వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే... కూల్ డ్రింకు రోజూ తాగితే, రోజూ మద్యం తాగినంత ప్రభావం శరీరంపై పడుతుంది. మద్యం ఎంత చేటు చేస్తుందో, కూల్ డ్రింకు కూడా మన శరీరానికి అంతే చేటు చేస్తుంది. సాయంత్రం పూట బజ్జీలు తింటూ కూల్ డ్రింకు తాగేవాళ్ళు, రాత్రిపూట బిర్యాని తింటూ కూల్ డ్రింకు తాగే వారు ఎంతోమంది ఉన్నారు. ఈ అలవాడు మానుకోపోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ముఖ్యంగా ఆడవాళ్లు కూల్ డ్రింకులు పూర్తిగా దూరం పెట్టాలి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు కూల్ డ్రింక్ తాగకూడదు. ఎందుకంటే రుతుక్రమం ఆగిపోయాక ఆ మహిళల్లో రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి శీతల పానీయాలు తాగడం వల్ల అవి వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. అలాగే కాలేయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్ ను ప్రతిరోజూ తాగడం లేదా తరచూ తాగడం చేయకూడదు. నెలలో మూడు సార్ల కంటే తక్కువగా తీసుకోవాలి. అంటే ఒక నెలలో కూల్ డ్రింకులు మూడుసార్లు కన్నా తక్కువగా తాగాలి. లేకుంటే దీర్ఘకాలికంగా ఈ డ్రింకు వాడితే కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మద్యం తాగడం వల్ల కూడా కాలేయం చెడిపోతుంది. అలాగే కూల్ డ్రింకులు తాగడం వల్ల కూడా కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అంతేకాదు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అవి తాగడం వల్ల శరీరానికి అందే పోషకాలు సున్నా. కేవలం నాలిక రుచి కోసం మాత్రమే కూల్ డ్రింకులు తాగుతున్నారు. అవి తాగినా, తాగకపోయినా ఒకటే. తాగకపోతే ఆరోగ్యం బాగుంటుంది. తాగితే ఆరోగ్యానికి చిల్లు పడడం ఖాయం. గర్భిణీలు కూల్ డ్రింకులు పూర్తిగా తాగకూడదు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కార్బోనేటెడ్ డ్రింకులకు దూరంగా ఉండడం చాలా అవసరం. చల్లని కూల్ డ్రింకులు తాగితే గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.
Also read: అక్షరాలు దిద్దించిన మీ తొలి గురువును ఓసారి తలుచుకోండి, వారే మీ ఉన్నతికి పునాది
Also read: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.