ష్టమైన పదార్థాలు కళ్ల ముందు కనిపిస్తుంటే తినకుండా ఎవరయినా ఆగుతారా చెప్పండి. వెంటనే వాటిని ఫుల్ గా లాగించేస్తారు. అయితే అందులో జత చేయకూడని ఆహారాన్ని కలిపి తీసుకుంటే మాత్రం మీ కడుపు గడ బిడ చెయ్యడం ఖాయం. ఆయుర్వేదం ప్రకారం కూడా విరుద్ధమైన ఆహర పదార్థాలు కొన్ని ఉన్నాయనై నూపుణులు చెబుతున్నారు. వాటిని కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. తినకూడని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరం లోని పోషకాల శోషణ అడ్డుకునే అవకాశం ఉంది. దీని వల్ల వికారం, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 


అయోడిన్ రిచ్ ఫుడ్స్ తో ఇవి వద్దు 


థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకొలి వంటి వాటిని అయోడిన్ రిచ్ ఫుడ్స్ తో కలిపి తినకూడదు. ఇలా చెయ్యడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించేలా చేస్తుంది. అలాగే పాలు, చేపలు వంటి పదార్థాలని కలిపి తీసుకోకపోవడమే ఉత్తమం. 


విటమిన్ సి, పాలు వద్దే వద్దు 


విటమిన్ సి అధికంగా ఉండే బచ్చలి కూర, నిమ్మకాయ, బెర్రీలు వంటి సిట్రస్ ఫుడ్ లో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. పాలలో కైసేన్ అనే సమ్మేళనం ఉంటుంది. పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి పాలు గడ్డకడతాయి. విటమిన్ సి పదార్థాలతో పాలని కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. 


భోజనంతో పండ్లు తినకూడదు 


పండ్లు సులభంగా జీర్ణం అవుతాయి. తినే భోజనం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే భోజనం తిన్న వెంటనే పండ్లు తీసుకోకూడదు. ఎందుకంటే ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల పండ్లు కడుపులోనే పులిసిపోతాయి. దాని వల్ల పుల్లటి తేన్పులు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. 


టీ, ఐరన్ ఎక్కువ ఉండేవి తినొద్దు 


టీ తో కలిపి నట్స్, ఆకు పచ్చని కూరలు, తృణ ధాన్యాలు తీసుకోకోవడం మానెయ్యాలి. ఇవి శరీరానికి హనీ కలిగిస్తాయి, అరుగుదల సమస్య తీసుకొస్తుంది. అంతే కాదు పరగడుపున టీ తాగడం కూడా మంచిది కాదు. 


నానబెట్టని గింజలు తినకూడదు 


చాలా గింజలు ఫైటిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి. బాదం, వేరుశెనగ, సోయాబీన్, వాల్ నట్స్ లో ఈ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రాత్రంతా నానబెట్టుకుని తినాలి. లేదంటే అవి అరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కాచిన నీరు మంచిదా? ఫిల్టర్ నీరు మంచిదా? మీరు ఏది తాగుతున్నారు


Also Read: ఒత్తిడిని అధిగమించలేకపోతున్నారా? ఇదిగో మ్యూజిక్ పరిష్కారం