నీరు జీవనాధారం. వర్షాకాల వచ్చిందంటే అందరూ చెప్పే మాట ఒక్కటే. నీటిని కాచుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తారు. జనాభా ఎక్కువగా ఉండటం, పర్యావరణ కాలుష్యం, సహజ వనరుల క్షీణత కారణంగా స్వచ్చమైన నీరు పొందటం ఈ కాలంలో సవాలుగా మారింది. అందుకే ఇప్పుడు మార్కెట్లో నీటిని రసాయనాలతో శుద్ది చేసిన నీరు అందుబాటులో ఉంటుంది. చాలా మంది ఫిల్టర్ చేసిన నీటిని తాగేందుకే ఇష్టం చూపిస్తున్నారు. కానీ రసాయనాలతో శుద్ది చేసిన నీరు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి కొంతమంది ఫిల్టర్ నీళ్ళు తాగకుండా నేరుగా కుళాయిల్లో వచ్చే నీటిని తాగేస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల డయేరియా వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి రాకుండా జాగ్రత్త పడాలంటే కాచిన నీటిని తాగడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
నేరుగా కుళాయి నీరు తాగడం మంచిదేనా?
కుళాయి నుంచి నేరుగా వచ్చే నీరు తాగడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు. నీటి శుద్ధి కర్మాగారంలో బ్యాక్టీరియాను చంపేందుకు నీటిలో క్లోరిన్ మరియు ఫ్లోరైడ్‌లను కలిపి శుద్ధి చేసి విదూయాల చేస్తారు. ఆ నీటిని కుళాయిలకు వదులుతారు. అవి నేరుగా మన ఇంట్లోని పైపులకి వస్తాయి కాబట్టి అవి సరక్షితమనే భావిస్తారు కొందరు. కానీ ఆ నీరు ఎక్కువ దూరం ప్రవహించి మన ఇంటికి చేరే పైపులకి వస్తాయి. ఆ పైపుల్లో బ్యాక్టీరియా, పాచి పేరుకుపోయి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నేరుగా కుళాయిలనుంచి వచ్చే నీరు సురక్షితం కాదని అంటారు. ప్లాంట్లలో నీరు నిల్వ చేసిన సమయాల్లోనూ బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. తాగునీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే రక్షిత మంచినీటిని అందించడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.
కాచిన నీరే తాగడం ఎందుకు?
సురక్షితమైన తాగు నీటి కోసం నీరు కాఛీ వడకడతారు. నీటిని వేడి చెయ్యడం వల్ల అందులో ఉన్న సూక్ష్మ క్రిములు చనిపోతాయి. అయితే నీటిని కేవలం కొద్ది సేపు మాత్రమే వేడి చెయ్యడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనీసం 20 నిమిషాల పాటు నీటిని బాగా మరిగించాలి. అప్పుడే అందులో ఉండే మలినాలు, కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియా తొలగిపోతాయి. అలా చేయకుండా కొద్ది సేపు నీటిని మరిగించుకుని తాగితే అవి సురక్షితం కాదు. తక్కువసేపు మరిగించడం వల్ల సీసం, ఆర్సెనిక్, మెగ్నీషియం మరియు నైట్రేట్లు వంటి మలినాలను కూడా పోవు. అందుకే నీటిని బాగా వేడి చేసుకోవాలి.
ప్యూరిఫై చేసిన నీరు మంచిదా లేక కాచిన నీరు మంచిదా
కాచిన నీటి కంటే ప్యూరిఫై చేసిన తాగు నీరే సురక్షితం. కలుషితమైన లేదా పంపు నీటి నుండి మలినాలను, రసాయనాలను మరియు సూక్ష్మ-జీవులను తొలగించడానికి నీటి శుద్ధి సహాయపడుతుంది, దానిని వ్యాధికారక రహితంగా చేస్తుంది. RO నుండి UV వాటర్ ప్యూరిఫైయర్‌ల వరకు, నీటిని శుద్ధి చేసి తాగేందుకు ఉపయోగపడేలా చేయడంలో సహాయపడే అనేక సాంకేతికతలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే, కాచిన నీరు, ప్యూరిఫై చేసిన నీరు ఆరోగ్యానికి మంచివే. కానీ, కుళాయి నీరు, మున్సిపల్ వాటర్‌ను నేరుగా తాగడం చాలా ప్రమాదకరం. కాబట్టి, ప్యూరిఫైర్ లేకపోయినా.. నీటిని బాగా మరిగించి, వడపోసి మరీ తాగండి.
నీటిలో అవసరమైన అన్ని ఖనిజాలు, విటమిన్లు ఉన్నందున సురక్షితమైన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీవక్రియ మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు బరువు తగ్గించే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. అందుకే మనం తాగే నీరు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.
Also read: కింద ఇచ్చిన చిత్రం మీ రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పేస్తుంది, ట్రై చేయండి
Also Read: వర్షాకాలంలో దోమల నుంచి ఇలా మీ చిన్నారులని రక్షించుకోండి