Praveen Nettaru's Murder Case: కర్ణాటకలో భాజపా యువ నేత ప్రవీణ్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జకీర్, షఫీక్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ కన్నడ ఎస్‌పీ జకీర్ తెలిపారు. వీరిలో ఒకరు సవనుర్, మరొకరు హవేరి జిల్లాకు చెందినట్లు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ (32)పై నెట్టారు ప్రాంతంలో దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
పౌల్ట్రీ షాప్ యజమాని అయిన ప్రవీణ్‌పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ హత్యకు గల కారణాలేంటి? చేసింది ఎవరు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిరసనలు
భాజపా కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారం సులియా, కడబ, పుత్తూరు సహా పలు తాలూకాల్లో బంద్ జరిగింది. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి.
ప్రవీణ్ హత్యపై ఆందోళన చేపట్టిన భాజపా కార్యకర్తలు, నిరసనకారులు.. దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కారుపై దాడి చేశారు. కారును చుట్టుముట్టి ఊపేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
Also Read: Rashtrapatni Remark: నేను బెంగాలీ, నాకు హిందీ రాదు- క్షమాపణలు మీకు చెప్పను: అధీర్
Also Read: Voter ID Card Eligibility: ఈసీ కీలక నిర్ణయం- 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు ఛాన్స్!