ఇండియన్ రైల్వేలో 35,208 ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టుల భర్తీకి కోసం నిర్వహించనున్న ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రెండో దశ ఆన్‌లైన్ పరీక్ష(CBAT-2)కు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.
మొదటిదశ(CBAT-1) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 30న ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఆన్‌లైన్ పరీక్ష(CBAT-2) నిర్వహించనున్నారు.
అభ్యర్థులు కింది లింక్ ద్వారా తమ పరీక్ష అడ్మిట్ కార్డులను పొందవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్ష అడ్మిట్‌కార్డులతోపాటు అభ్యర్థుల పరీక్ష రాసే నగరానికి సంబంధించిన ఇంటిమేషన్ స్లిప్‌లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.
అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1. అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లాగిన్ అవ్వాలి.
Step 2. అక్కడ హోంపేజీలో 'Click here to login to view and download your E-Call letter for CBAT, Exam City and Date Intimation Slip' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 3. క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ విండోలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేయాలి.
Step 4. వివరాలు నమోదుచేసి Login బటన్‌పై క్లిక్ చేయగానే RRB NTPC Admit Card కనిపిస్తోంది.
Step 5. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్ష సమయంలో అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
RRB NTPC NTPC CBT 2 Exam- పరీక్ష విధానం:
ఎన్‌టీపీసీ పరీక్ష రాయడానికి అభ్యర్థులకు 90 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తంగా 120 ప్రశ్నలు ఉంటాయి. అందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50, గణితం నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుండి 35 ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. దివ్యాంగులకు పరీక్ష రాయడానికి 120 నిమిషాల సమయం కేటాయించనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల తరఫున వారి వెంట వచ్చిన వ్యక్తి పరీక్ష రాయవచ్చు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్‌తో ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.
అర్హత మార్కులు
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో కనీస మార్కుల శాతం సాధించాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు, ఎస్సీ అభ్యర్థులు 30 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.