క్యాన్సర్ పేరు వింటేనే భయపడే వారు ఎంతో మంది. తెలియకుండా శరీరంలో చిన్న కణంలో మొదలైన క్యాన్సర్ ఇంతింతై ఎదుగుతూ ప్రాణాంతకంగా మారుతుంది. అత్యంత హానికరమైన వ్యాధుల్లో ఇది ఒకటి. క్యాన్సర్ కణితులు అనియంత్రంగా ఎదుగుతూనే ఉంటాయి. ప్రారంభదశలో ఈ క్యాన్సర్ కణితి ప్రాణాలు తీసేంత స్థాయిలో ఉండదు కానీ, దాని నిర్లక్ష్యం చేస్తే మాత్రం వ్యాధి ముదిరి మెటాస్టాటిక్ గా మారుతుంది.


వారసత్వంగా వస్తుందా?
క్యాన్సర్ చాలా అరుదుగా జన్యుపరంగా కూడా వస్తుంది. అంటే వారసత్వంగా అని అర్థం. కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉండే తరువాత తరాల వారికి వచ్చే అవకాశం ఉంది.  ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తున్నప్పటికీ ఇలాంటి వారసత్వపు క్యాన్సర్లు దాడి చేస్తుంటాయి. అందుకే ఇలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సమతుల్యఆహారాన్ని తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉన్న వ్యక్తులు తమ ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అనారోగ్యకరమైన అలవాట్లను కూడా మానుకోవాలి. లేకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 


ఈ ఆహారాలకు దూరం...
ఉప్పు: ఎక్కువ ఉప్పు తినడం వల్ల హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువని అందరికీ తెలిసిందే. అలాగే కాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ప్రకారం పొట్ట క్యాన్సర్ రావడానికి ఉప్పు, ఉప్పగా ఉండే ఆహారపదార్థాలకు మధ్య అనుబంధం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. 


బీఫ్: క్యాన్సర్ కుటుంబచరిత్రను కలిగి ఉన్నవారయితే బీఫ్ ను దూరం పెట్టాలి. ముఖ్యంగా కొన్నిరకాల బర్గర్లలో బీఫ్ పెట్టి ఇస్తారు. ఇది పెద్దపేగు క్యాన్సర్ రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే వారానికి 500 గ్రాముల కంటే అధికంగా బీఫ్ ను తినకూడదు. 


ప్రాసెస్డ్ మాంసం: సాసేజ్, స్టీక్ లు, సలామీలు, ఫ్రైడ్ చికెన్ లు వంటి ప్రాసెస్ చేసిన మాంసంతో చేసిన వంటకాలలో సోడియం అధికంగా ఉంటుంది. ప్రిజర్వేటివ్ మాంసాలన్నింటిలో అధిక సోడియం ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కొవ్వులు, ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ప్రాసెస్ట్ చికెన్ లో అధికంగా ఉంటాయి కనుక వాటిని దూరంగా పెట్టాలి. 


చేపల ఫ్రై: ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే వాటిల్లో చేపలు ఒకటి. అయితే వాటిని డీప్ ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేపలను బాగా వేయించినప్పుడు సహజ ఒమెగా 3 స్థాయిలు తగ్గుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు పెరుగుతాయి.దీని వల్ల ప్యాంక్రియాటిక్, అండాశయాలు, కాలేయం, రొమ్ము, కొలరొకెటల్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 


పైవాాటితో పాటూ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ రెండూ కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Also read: ఉక్రెనియా యుద్ధంలో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న భారతీయ రెస్టారెంట్ ‘సాథియా’, బంకర్లో ఉండడమే ఈ రెస్టారెంట్ అదృష్టం