Bigg Boss Non Stop: 'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. ఐదో రోజు బుధవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన హైలెట్స్‌ను ఇప్పుడు చూసేద్దాం!


హమీదతో సరయు గొడవ: హమీదా తనని టార్గెట్ చేసిందని.. ఆమె అనే మాటల్ని తీసుకోలేకపోతున్నా.. అంటూ అఖిల్, ముమైత్ ఖాన్‌ ల దగ్గర ఏడ్చేసింది సరయు. ఇంతలో హమీదా వచ్చి.. అఖిల్ నువ్ ఆమె మాటల్ని మాత్రమే విని డిసైడ్ అయిపోకు.. ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడు అని డైలాగ్ కొట్టింది. దానికి అఖిల్.. నువ్వే ఇక్కడికి వచ్చి మాట్లాడు.. నేను ఆమె చెప్పింది మాత్రమే వింటున్నా.. ఏడుస్తుందని ఏమైందని అడుగుతున్నా అని కౌంటర్ ఇచ్చాడు.


నటరాజ్ మాస్టర్ ఫైర్: నటరాజ్ మాస్టర్(Nataraj Master), యాంకర్ శివ(Anchor Siva) ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలో విరుచుకుపడ్డారు. నటరాజ్ మాస్టర్ తనపై అంటించిన స్టిక్కర్స్ ను తీసేస్తున్నారనుకొని.. 'మాస్టర్ మీరు అలా చేస్తే బాగోదు చెప్తున్నా.. చాలా..' అంటూ మధ్యలోనే ఆపేశాడు శివ. దీంతో నటరాజ్ మాస్టర్ కికోపమొచ్చింది . 'ఏం చేస్తావ్ చెప్పు.. ఏం పీకుతావ్ నువ్.. తోలుతీస్తా.. నా బొంగు కూడా పీకలేవ్' అంటూ రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. 
నిజానికి ముందు శివనే నటరాజ్ మాస్టర్ ని కెలికాడు. దీంతో ఆయన మండిపడ్డారు. నటరాజ్ మాస్టర్ ని కంట్రోల్ చేయడానికి ఆయన టీమ్ ఎంత ప్రయత్నించినా.. ఆయన మాత్రం తగ్గలేదు. 


అషురెడ్డిపై తేజస్వి ఫైర్: వారియర్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారంతా ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారు చేసిన పొరపాట్లు ఏంటో.. ఆ పొరపాట్ల నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. వారు చెప్పే విషయాలు నచ్చితే ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు థంబ్స్ అప్  ఇవ్వొచ్చు. అలానే వారిని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో అషు రెడ్డి ఓ విషయాన్ని షేర్ చేసుకుంటున్న సమయంలో.. యాంకర్ రవి కల్పించుకొని 'జనాల కోసం ఆడుతున్నావా..? నీకోసం నువ్ ఆడుతున్నావా..?' అని ప్రశ్నించాడు.వెంటనే తేజస్వి 'యస్.. థాంక్యూ మై ఫ్రెండ్' అంటూ వెటకారంగా డైలాగ్ వేసింది. దీంతో అషురెడ్డి హర్ట్ అయింది. మళ్లీ తేజస్వి కల్పించుకుంటూ.. 'జనాలు చూస్తున్నారు కాబట్టి ఒకలాగ ఉండాలి.. జనాలు చూస్తున్నారనే ఆలోచన నీకు ఎప్పుడూ ఉందనుకో.. అది కూడా జనాలకు కనిపిస్తాది' అని అషురెడ్డిని ఉద్దేశిస్తూ.. డైలాగ్స్ వేసింది. దానికి అషు.. 'నేను మాట్లాడుతున్నప్పుడు నా సంభాషణలో ఇన్వాల్వ్ అవ్వొద్దు' అని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. 


Also Read: 'తోలుతీస్తా' యాంకర్ శివకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటరాజ్ మాస్టర్


Also Read:నటరాజ్ మాస్టర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? కూతుర్ని తలచుకుంటూ ఏడ్చేశాడు