వారియర్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారంతా ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారు చేసిన పొరపాట్లు ఏంటో.. ఆ పొరపాట్ల నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. వారు చెప్పే విషయాలు నచ్చితే ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు థంబ్స్ అప్ ఇవ్వొచ్చు. అలానే వారిని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో అషు రెడ్డి ఓ విషయాన్ని షేర్ చేసుకుంటున్న సమయంలో.. యాంకర్ రవి కల్పించుకొని 'జనాల కోసం ఆడుతున్నావా..? నీకోసం నువ్ ఆడుతున్నావా..?' అని ప్రశ్నించాడు.
వెంటనే తేజస్వి 'యస్.. థాంక్యూ మై ఫ్రెండ్' అంటూ వెటకారంగా డైలాగ్ వేసింది. దీంతో అషురెడ్డి హర్ట్ అయింది. మళ్లీ తేజస్వి కల్పించుకుంటూ.. 'జనాలు చూస్తున్నారు కాబట్టి ఒకలాగ ఉండాలి.. జనాలు చూస్తున్నారనే ఆలోచన నీకు ఎప్పుడూ ఉందనుకో.. అది కూడా జనాలకు కనిపిస్తాది' అని అషురెడ్డిని ఉద్దేశిస్తూ.. డైలాగ్స్ వేసింది. దానికి అషు.. 'నేను మాట్లాడుతున్నప్పుడు నా సంభాషణలో ఇన్వాల్వ్ అవ్వొద్దు' అని చెప్పింది.
వెంటనే తేజస్వి.. 'నేను నటరాజ్ మాస్టర్ తో ఆరోజు మాట్లాడుతున్నప్పుడు నువ్ ఇన్వాల్వ్ అయి కామెంట్స్ చేశావ్' అని డైలాగ్ కొట్టగా.. 'అది నా కళ్ల ముందే జరిగిందని' అషు చెప్తున్నా.. ఆమెకి ధీటుగా సమాధానాలు ఇస్తూనే ఉంది తేజస్వి. ఆ తరువాత అషురెడ్డిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది అరియానా. తనకు ఈ విషయం నామినేషన్స్ వరకు తీసుకెళ్లడం ఇష్టం లేదని.. కానీ ఆమె ఇలానే చేస్తే తీసుకెళ్తానని చెప్పింది అషురెడ్డి.
మరోపక్క తేజస్వి.. నటరాజ్ మాస్టర్ తో డిస్కషన్ పెట్టింది. 'ఇంట్లోకి రాగానే నువ్ మోస్ట్ జెలస్ ఫీలయ్యే మనిషితో నువ్ గొడవ పెట్టుకుంటావ్.. ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతామో వాళ్లను గుంజడానికి ప్రయత్నిస్తాం' అంటూ అషు తనను టార్గెట్ చేసినట్లు చెప్పింది తేజస్వి. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో అషు చాలా బాధపడింది.
Also Read: 'తోలుతీస్తా' యాంకర్ శివకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటరాజ్ మాస్టర్
Also Read:నటరాజ్ మాస్టర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? కూతుర్ని తలచుకుంటూ ఏడ్చేశాడు