కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల కోసం బిగ్ బాస్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ కి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. ముందుగా 'దమ్ముంటే చేసి చూపించు' అనే ఈ టాస్క్ లో రెండు టీమ్ లు పోటీపడ్డాయి. ఫైనల్ గా వారియర్స్ టీమ్ లీడ్ లో ఉండడంతో ఆ గ్రూప్ నుంచి కెప్టెన్సీ పోటీదారుల పేర్లను అనౌన్స్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. అందరూ కలిసి మహేష్ విట్టా(Mahesh Vitta), తేజస్వి(Tejaswi) పేర్లు చెప్పారు. 


ఆ తరువాత కెప్టెన్సీ పోటీదారుల కోసం మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా.. ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు చొప్పున పోటీ పడాల్సి ఉంటుంది. స్టిక్కర్లు అతికించుకునే ఈ టాస్క్ లో వారియర్స్ టీమ్ కి సంచాలక్ గా ముమైత్, ఛాలెంజర్స్ టీమ్ కి సంచాలక్ గా శివ వ్యవహరించారు. ఏ టీమ్ అయితే ఎక్కువ స్టిక్కర్లను అవతలి టీమ్ వాళ్లపై అంటిస్తుందో వాళ్లే విజేతలు. ఈ టాస్క్ మొదలైన దగ్గర నుంచి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 


ఇప్పటికే ముమైత్ ఖాన్, బిందు మాధవి మధ్య గొడవ రాగా.. ఇప్పుడు నటరాజ్ మాస్టర్(Nataraj Master), యాంకర్ శివ(Anchor Siva) ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలో విరుచుకుపడ్డారు. నటరాజ్ మాస్టర్ తనపై అంటించిన స్టిక్కర్స్ ను తీసేస్తున్నారనుకొని.. 'మాస్టర్ మీరు అలా చేస్తే బాగోదు చెప్తున్నా.. చాలా..' అంటూ మధ్యలోనే ఆపేశాడు శివ. దీంతో నటరాజ్ మాస్టర్ కికోపమొచ్చింది . 'ఏం చేస్తావ్ చెప్పు.. ఏం పీకుతావ్ నువ్.. తోలుతీస్తా.. నా బొంగు కూడా పీకలేవ్' అంటూ రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. 


నిజానికి ముందు శివనే నటరాజ్ మాస్టర్ ని కెలికాడు. దీంతో ఆయన మండిపడ్డారు. నటరాజ్ మాస్టర్ ని కంట్రోల్ చేయడానికి ఆయన టీమ్ ఎంత ప్రయత్నించినా.. ఆయన మాత్రం తగ్గలేదు. శివ సంచాలక్ అనే విషయం మర్చిపోయి గేమ్ ని డిస్టర్బ్ చేయడంతో మధ్యలో అఖిల్ కల్పించుకొని గేమ్ ఆగిపోతుందని చెప్పినా వినలేదు. ఆ తరువాత శివ.. నటరాజ్ మాస్టర్ తనను అలా అనడం నచ్చలేదని ముమైత్ కి చెప్పాడు. అలానే ఫిజికల్ గేమ్ పెట్టండి బిగ్ బాస్ మేం రెడీగా ఉన్నామంటూ రెచ్చిపోయాడు శివ. ఫైనల్ గా టాస్క్ గెలిచిన వారియర్స్ టీమ్ నటరాజ్ మాస్టర్, సరయు ఇద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు.