Horoscope Today 3rd March 2022:ఈ రాశి నిరుద్యోగులకు శుభసమయం-ఉద్యోగులకు పదోన్నతి, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

మార్చి 3అమావాస్య గురువారం రాశిఫలితాలు

Continues below advertisement

మేషం
చేయాల్సిన పనిపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది.ఈరోజు మీ విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు ఉండొచ్చు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.

వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ప్రత్యర్థులు కాస్త తగ్గి ఉంటారు.  కుటుంబ పరిస్థితి బలంగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో దంపతుల మధ్య పరస్పర సహకారం  ఉంటుంది.గృహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ నుంచి లాభాలు ఉంటాయి.

మిథునం
వ్యాపారాల గురించి కొత్త ఆలోచనలు వస్తాయి, లావాదేవీలు జరుపుతారు. అధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.  మీ సంపద పెరగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే శుభసమయం.  విద్యార్థులు చదువులో రాణిస్తారు. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మవద్దు.

కర్కాటకం
ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కొన్ని పనుల్లో నష్టం రావచ్చు.క్రెడిట్ లావాదేవీలు అస్సలు చేయవద్దు. స్నేహితుడి మాటల గురించి చింతించకండి. ఈ రోజు మీ మనస్సు పనిలో నిమగ్నమై ఉండదు. అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. 

Also Read: గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు
సింహం
ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. అనియంత్రిత ఆహారాన్ని తీసుకోవద్దు.  తలపెట్టిన పనులన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. జీవనశైలి మెరుగుపడుతుంది. అధికారులను కలిస్తే బాగుంటుంది. వ్యాపారంలో మీ పురోగతితో మీరు సంతృప్తి చెందుతారు. వినోద సాధనాలు ఎక్కువ ఖర్చు అవుతాయి. వ్యవసాయం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

కన్య
మీ సామర్థ్యాన్ని మీరు నమ్మండి.  తెలియని వ్యక్తుల వల్ల  మీ పనులకు ఆటంకం కలగొచ్చు.  మీ పిల్లలు ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు.  మీరు కెరీర్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

తుల 
మీరు కొత్త పనిలో పెట్టుబడి పెట్టవచ్చు. కోర్టు కేసులో మీకు వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. సమస్య పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రేమికులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.

వృశ్చికం
ఈ రోజంతా మీరు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను రక్షించండి. అనైతిక చర్యలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మితిమీరిన ఉత్సాహం కారణంగా, పని చెడిపోతుంది. ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ఏదో ఒక పనిలో కొత్త ప్రయత్నం చేస్తారు.

Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం
ధనుస్సు 
మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు.  కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ఇదే మంచిసమయం. ప్రేమికులకు ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. ఉద్యోగంలో బదిలీలు జరిగే అవకాశం ఉంది. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి.

మకరం
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మిత్రులను కలుస్తారు. ఆరోగ్య సమస్య ఉండొచ్చు. కుటుంబ సభ్యుల పురోగతితో సంతోషిస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

కుంభం
నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. పొదుపు చేయగలుగుతారు, నిలిచిపోయిన ప్రణాళికలను ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు శుభసమయం. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. దైవ సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

మీనం
మీరు ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. మీ స్నేహితులు లేదా అధికారులతో  వాగ్వాదం ఉండొచ్చు. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకండి. తెలియని వ్యక్తుల వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. అధిక శ్రమ అలసటకు కారణమవుతుంది. ఈరోజు బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి.

Continues below advertisement