రోజుల్లో చాలా మంది కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి పని చేస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం కదలకుండా కూర్చొని పని చేయడం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది స్మోకింగ్ కంటే ప్రమాదకరమట. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


1. ఉల్లాసంగా ఉండలేరు


కదలకుండా కూర్చొని పని చేయడం వల్ల ప్రవర్తన మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. డిప్రెషన్, యాంగ్జయిటీ పెరిగే ప్రమాదం ఉంది. నిరాశ, ఆందోళన లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు  వీలైనంత వరకు వ్యాయామం చేయాలి. తరచుగా విరామం తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.  


2. ఆయుష్షు తగ్గిపోతుందట


చాలా గంటల పాటు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి ఆయుష్షు మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీలైనంత వరకు ఎక్కువ సేపు కూర్చోవడాన్ని తగ్గించాలంటున్నారు నిపుణులు. లేదంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును పెంచేందుకు సరిపడ శారీరక శ్రమను కల్పించాలి. వీలైనంత వరకు మధ్య మధ్యలో లేచి నడవడం ఉత్తమం. తరచుగా కాసేపు బ్రేక్ తీసుకోవడం మంచిది. ఈ గ్యాప్ లో కాసేపు వర్కౌట్స్ చేయడం కూడా ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.  


3. ఊబకాయం


ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల క్యాలరీల ఖర్చు తగ్గి ఈజీగా బరువు పెరుగుతారు. ఫలితంగా ఒబేసిటీ ఏర్పడుతుంది.  అందుకే, తరచుగా లేచి నడుస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 


4. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం


ఎక్కువ సేపు కూర్చోని వర్క్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం, బలహీనమైన గ్లూకోజ్ జీవక్రియ కారణంగా ఈ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే, ఇన్సులిన్ సెన్సిటివిటీతో పాటు  గ్లూకోజ్ మెటబాలిజంను మెరుగుపరచడానికి మధ్య మధ్యలో కాస్త వ్యాయామాలు చేయడం మంచిది.  


5. మస్క్యులోస్కెలెటల్ నొప్పి


ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి ఏర్పడుతుంది. అందుకే, మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండాలి. కంఫర్టుగా కూర్చునేలా ఎర్గోనామిక్ ఫర్నిచర్ ఉపయోగించాలి.


6. గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం


ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు ఏర్పడే అవకాశం ఉంటుంది. హైబీపీ, హార్ట్ స్ట్రోక్‌ తో సహా పలు  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ, జీవక్రియ తగ్గి గుండె సమస్యలు తలెత్తుతాయి. రెండు, మూడు గంటలకు ఓసారి కొన్ని నిమిషాల పాటు లేచి తిరడం, సైకిల్ తొక్కడం లాంటివి చేస్తే హృదయ సంబంధ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.     


Read Also: ఏమీ చేయకుండా ఉండడం బద్ధకం కాదు బాసూ, అదో ఆర్ట్ - డచ్ ఫిలాసఫీకి ఫిదా అవుతారంతే