ఒకప్పుడు తెలుగు వంటకాల్లో గోంగూరది గొప్ప స్థానం. కానీ ఇప్పుడు దాని వాడకం తగ్గిపోయింది.చాలా తక్కువ మంది మాత్రమే పప్పు గోంగూర, గోంగూర పచ్చడి చేసుకుని తింటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోనే ఈ వంటకాలు కనిపిస్తున్నాయి. నిజానికి గోంగూర తినడం వల్ల చాలా ఆరోగ్యలాభాలు ఉన్నాయి. అందుకే గోంగూరను తేలిగ్గా తీసిపారేయకూడదు. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
ఎన్ని పోషకాలో...
గోంగూరలో ఎ విటమిన్ తో పాటూ, బి1, బి2, బి9, సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకే కంటి చూపు నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్ని విధాలుగా ఇది సహకరిస్తుంది. దీనిలో పొటాషియం, ఇనుము వంటి పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని పిల్లలు, పెద్దలూ అందరూ తింటే చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు తింటే చాలా మంచిది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది, చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అందుకే గోంగూర పచ్చడి, గోంగూర రైస్, గోంగూర పప్పు వంటివి తినాలి. వారానికి కనీసం రెండు సార్లు తింటే మధుమేహులకు చాలా మంచిది. దంతసమస్యలు ఉన్న వారికి గోంగూర మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు తినిపించడం చాలా మంచిది.
రేచీకటి రాదు
కంటిచూపును మెరుగుపరచడంలో గోంగూర ముందుంటుంది. రేచీకటి ఉన్న వారు దీన్ని తింటే చాలా మంచిది. ఆ సమస్య తగ్గుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములు కొందరిని వేధిస్తుంటాయి. అలాంటివారు ఈ ఆకుకూరను తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. గోంగూరలో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు దీన్ని తినడం చాలా అవసరం.
పడుతుందో లేదో చూసుకునే...
కొన్ని ఆహారాలు ఎందుకో గాని కొంతమంది శరీరాలకు పడవు. తినగానే ఏదో ఒక రియాక్షన్ కనిపిస్తుంది. అలాంటి వాటిట్లో గోంగూర కూడా ఒకటి. ఇది అందరికీ పడాలని లేదు. కాబట్టి మీకు ఈ ఆకుకూర పడుతుందో లేదో తెలుసుకోండి. మీకు పడితే ఎంత తిన్నా ఫర్వాలేవు. ఒకవేళ పడకపోతే మాత్రం దాని జోలికి పోకుండా ఉండడం ఉత్తమం.
Also read: ఆ ఊరికి అల్లుడిగా వెళతారా? కట్నంగా ఏమిస్తారో తెలిస్తే చచ్చినా వెళ్లరు
Also read: చిటికెలో చికెన్ దోశ, చినుకుల్లో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు
Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే