అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సక్సెస్ కోసం చాలా పరితపించారు. కానీ ఆయన నటించిన సినిమాలన్నీ ఏవరేజ్ గా ఆడాయి. ఎట్టకేలకు తన నాల్గో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇంతకాలానికి హిట్ దక్కడంతో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో.


తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతుంది చిత్రబృందం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేసింది. జూలై 15న టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఈ తేదీ తర్వాత పాన్ ఇండియా మొత్తం ఏజెంట్ కోసం ఎదురుచూస్తారు. జూలై 15న ఒక వైల్డ్ స్టైల్ వ్యాపించబోతుంది' అని మేకర్స్ తెలిపారు. 


హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు వాయిదా పడుతుందని టాక్. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఈ సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


Also Read: సూర్యతో దుల్కర్ సల్మాన్ - మరో క్రేజీ ప్రాజెక్ట్ తో 'కేజీఎఫ్' నిర్మాతలు!


Also Read: 'హ్యాపీ బర్త్ డే'తో మత్తు వదిలిపోయింది!