Sleep After Bath: రాత్రి వేళల్లో స్నానం చేయలేదంటే నిద్రపోని వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారందరికీ ఇదో హెచ్చరిక. అలా చేయడం వల్ల ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు. నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేస్తే మెదడుపై దుష్ప్రభావం పడుతుందని ఆందోళన, డిప్రెషన్‌కు కారణమవుతాయని చెబుతున్నాయి.
చాలా మంది స్నానం చేసిన వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. కానీ సైన్స్ మాత్రం అది ఎంత మాత్రం మంచిది కాదను హెచ్చరిస్తోంది. ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మెదడుకు సంబంధించిన అనేక సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు.
చాలా మందికి రాత్రిపూట స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇది అంత మంచి అలవాటు కాదని పరిశోధనలు చెబుతున్న సత్యం. వాస్తవానికి రాత్రి వేళ్లలో మన శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీన్ని మెదడు గ్రహించి బాడీకి రెస్ట్ కావాలనే సంకేతాలు ఇస్తుంది. నిద్ర పోవాలనే సూచన చేస్తుంది.
ఇలా నిద్రపోవాలని మెదడు సిగ్నల్ ఇస్తున్న టైంలో మీరు స్నానం చేస్తే మాత్రం బాడీలోని టెంపరేచర్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఒక వేళ నిజంగానే మీకు నిద్ర పట్టినా మెదడుకు మాత్రం రెస్ట్ దొరకదు.
స్నానం చేసిన తర్వాత నిద్రపోవడం వల్ల శారీరకంగా చాలా అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కొందరు తలస్నానం చేసిన వెంటనే నిద్రపోతుంటారు. ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివి పూర్తిగా మానుకోవాలని సూచిస్తున్నారు.
స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
1. జుట్టు సంబంధిత సమస్యలు
స్నానం చేసిన తర్వాత తడి వెంట్రుకలతో నిద్రించడం వల్ల దిండు లేదా మంచం మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల స్కాల్ప్ దెబ్బతింటుంది, జుట్టు చిట్లడం సమస్య పెరుగుతుంది. జుట్టులో చుండ్రు వస్తుంది.
2. కళ్లలో దురద సమస్య
వేడి నీళ్లతో నిరంతరం స్నానం చేయడం వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీని వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. దురద సమస్య మొదలవుతుంది. దీని కారణంగా అనేక ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా రావచ్చును.
3. నిద్ర లేమి
రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ నిద్ర చెడి పోతుంది. దీని వల్ల పగటి అలసట పెరుగుతుంది. బాడీ రెస్ట్ కోరుకుంటుంది. నిద్ర సరిగా పట్టకపోవడంతో అనేక ఇతర సమస్యలు వస్తాయి. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ పెరగవచ్చు.
4. బరువు పెరగవచ్చు
రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల బరువు పెరగుతారు. ఇది ఫిట్‌నెస్‌ను పోగొడుతుంది. దీంతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. పెరుగుతున్న ఊబకాయంతో మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
5. కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి
రాత్రిపూట స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, నడవడం కష్టమవుతుంది. రాత్రిపూట ఆలస్యంగా స్నానం చేయడం వల్ల కండరాలు తిమ్మిరి ఎక్కే ప్రమాదం ఉంటుంది.
హెచ్చరిక: వార్తలలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంటుంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి.
Also Read: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల పెరుగుతోన్న మరణాలు.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే