Andhra Getting Funds From Central : పన్నుల్లో వాటా కింద కేంద్రం ఏపీకి రూ. ఏడు వేల కోట్లకుపైగా మంజూరు చేసింది. అది తెలంగాణకు మూడున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. గోదావరి పుష్కరాలకు రూ. వంద కోట్లు విడుదల చేసింది. అమరావతికి రూ.పదిహేను వేల కోట్లు మంజూరు చేసింది. ఇక కేంద్ర ప్రాజెక్టుల సంగతి చెప్పాల్సిన పని లేదు.  ఇలా ఏపీకి కేటాయిస్తున్న నిధుల విషయంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉండటం వల్లనే ఇన్ని నిధులు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి నిజంగానే అన్ని నిధులు వస్తున్నాయా ? 


ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారా ?


పన్నుల్లో వాటాలను ఆర్థిక సంఘం డిసైడ్ చేస్తుంది. రాష్ట్రాల లోటును బట్టి ఆ పన్నుల్లో వాటాను డిసైడ్ చేస్తారు.తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది కాబట్టి పన్నుల్లో వాటా కాస్త తక్కువగా ఉంటుంది. ఏపీకి ఎక్కువగా ఉంటుంది. గత పదేళ్లుగా ఇంతే . ఏపీకి ప్రత్యేకంగా ఎక్కువ కేటాయించలేదు. అలాగే కేంద్ర ప్రాజెక్టులు.. ఇతర విషయాల్లో కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో భాగంగానే ఏపీకి వచ్చాయి కానీ ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపు కాదని చెబుతున్నారు. పోలరం ప్రాజెక్టు విషయంలో రీఎంబర్స్ చేయాల్సిన నిధుల్లో కొన్ని చేశారు. మరో రెండు వేల కోట్ల వరకూ అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి కేంద్రం వంద శాతం నిధులు భరించాల్సి ఉంది. ఇలా వచ్చిన నిధులను చూస్తే అన్నీ చట్టబద్దమైనవే కానీ ఏపీకి ప్రత్యేకంగా కేటాయించడం లేదని అంటున్నారు. 



Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?



గత ప్రభుత్వంతో పోలిస్తే మాత్రం మెరుగు 


గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకి నిధులు ఎక్కువగా వస్తున్నాయని అనుకోవచ్చు. గతంలో పోలవరం పనులు చేయించలేదు కాబట్టి నిధులు మంజూరు చేయలేదు. అమరావతి నిర్మాణం ఆపేశారు కాబట్టి అమరావతికి ఎలాంటి నిధులు, అప్పులు ఇప్పించలేదు. అలాగే రైల్వే ప్రాజెక్టుు, రోడ్ల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్లు కూడా కేటాయించలేదు కాబట్టి ఆ నిధులు కూడా రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మంజూరు చేయించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఎక్కువ నిధులు వస్తున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. 


రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు


కేంద్ర ప్రాజెక్టుల సాధనకు చంద్రబాబు కృషి


ఏపీకి నేరుగా నగదు బదిలీ ద్వారా సాయం చేయమని మాత్రమే చంద్రబాబు కోరడం లేదు. కేంద్రం తరపున పెట్టుబడులు కూడా పెట్టాలని కోరుతున్నారు. బీపీసీఎల్‌తో పాటు బుల్లెట్ ట్రైన్... ఇతర ప్రతిపాదనల్లో ఏపీ ఉండేలా చూసుకుంటున్నారు. అమరావతికి అప్పును ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం ఇప్పిస్తోంది. మంజూరు అయింది కూడా. నిర్మాణాలు ప్రారంభించడమే మిగిలింది. కేంద్రం నుంచి ఎప్పుడూ వచ్చే నిధులు కాకుండా.. అదనంగా వస్తున్న నిధులు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు ప్రయత్నాలు ద్వారానే వస్తున్నాయని చెబుతున్నారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం రూ. వంద కోట్లు మంజూరు చేసింది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఇలాంటివి ప్రత్యేక ప్రయత్నాల ద్వారా వస్తాయని అనుకోవచ్చు.