‘ఒక దీపికా పడుకోన్ పార్శిల్’ అనగానే ఆ రెస్టారెంట్లో పావుగంటలో ఆ పార్శిల్ చేసి ఇస్తారు. ఆ పార్శిల్ లో ఉండేది ఒక దోశె. దోశెకు దీపికా పడుకోన్ పేరు పెట్టి అమ్మేస్తున్నాడు ఒక రెస్టారెంట్ యజమాని. ఆ రెస్టారెంట్ ఉన్నది అమెరికాలోని టెక్సాస్‌లో. ఆ దోశె ధర పది డాలర్లు. అంటే మన రూపాయల్లో రూ.700. ఈ దోశెకు చాలా డిమాండ్ ఉంది. భారతీయులు అధికంగా ఉండే ఆ ప్రాంతంలో దీపికా పడుకోన్ దోశె పార్శిళ్లు, తినేవాళ్లతో గిరాకీ జోరుగా ఉంది. పెళ్లయ్యాక దీపికా కూడా తన భర్తతో కలిసి దోశె రుచి చూసి వచ్చింది. అందరినీ తినమని ప్రచారం కూడా చేసింది.ఆ దోశె నిండుగా బంగాళాదుంప కర్రీతో, పచ్చిమిర్చి నిండి ఉంటుంది. స్పైసీగా తినాలనుకునేవారికి ఈ దోశె మంచి ఎంపిక. 


సన్నీలియోన్ మలాయ్ చాప్...
ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తే బాలీవుడ్ తారల పేర్లతో వ్యాపారం చేస్తుంటే మన వాళ్లు ఊరుకుంటారా? ఢిల్లీలో సన్నిలియోన్ పేరుతో మలాయ్ చాప్ అనే ఆహారాన్ని అమ్మేస్తున్నారు. అలాగే మియా ఖలీఫా మలాయ్ చాప్  కూడా అందుబాటులో ఉంది. అలాగే పూణెలో దీపికా పడుకోన్ పరాతా ఫేమస్. ఢిల్లీలోనే కరీనా కపూర్ పేరుతో పిజాను అమ్ముతున్నారు.‘కరీనాస్ సైజ్ జీరో పిజా’ అని పేరు పెట్టారు. 


ప్రియాంక మిల్క్ షేక్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది ప్రియాంక. అమెరికా కోడలిగా మారిపోయింది. వెస్ట్ హాలీవుడ్ ప్రాంతంలోని ఓ షాపులో మిల్క్ షేక్‌కు ఆమె పేరు పెట్టారు. అక్కడికి వెళ్లి ‘వన్ ప్రియాంక చోప్రా’ అంటే చాలు మిల్క్ షేక్ గ్లాసు చేతిలో పెడతారు. అరటిపండ్లు, బాదం, వెనిల్లా ఐస్ క్రీము వేసి చేసే టేస్టీ మిల్క్ షేక్ ఇది. 


అక్షయ్ కుమార్స్ కాక్ టెయిల్
ఒమన్ దేశంలో ఓ కాక్ టెయిల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు పెట్టారు. ఆయన నటించిన ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారా’ సినిమాను ఒమన్లోని ఓ రిసార్టులో నే చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్ధం కాక్ టెయిల్‌కు ఆయన పేరును పెట్టారు. 


చికెన్ సంజూ బాబా 
ముంబైలోని నూర్ మహమ్మది రెస్టారెంట్ కి వెళితే కచ్చితంగా సంజూ బాబా చికెన్ కర్రీని ఆర్డర్ చేయండి. టేస్ట్ అదిరిపోతుందట. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరును ఈ కర్రీకి పెట్టారు. ఇది ఆ రెస్టారెంట్లో అధికంగా అమ్ముడవుతున్న రెసిపీలలో ఒకటి. 


Also read: ముద్దుల తమ్ముడికి అయిదు కిలోల లెటర్ రాసిన అక్క, ఇదో వరల్డ్ రికార్డు




Also read: చినుకు పడగానే విజృంభిస్తున్న టైఫాయిడ్, ఇది అంటువ్యాధి, ఈ జాగ్రత్తలు తీసుకోకతప్పదు


Also read: కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, బూస్టర్ డోసు తీసుకున్నా సరే వీళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే