General Tips for Underwear and Fertility : లోదుస్తులు ఫెర్టిలిటీ సమస్యలను పెంచుతాయా? మగవారు వేసుకునే అండర్​వేర్​ కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? అంటే పూర్తిగా కాకపోయినా.. కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.  ముఖ్యంగా వీ కట్ అండర్​వేర్, బాక్సర్ లో దుస్తుల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడిస్తూ.. ఏవి వేసుకుంటే మంచిదో సూచిస్తున్నారు. ఇంతకీ మగవారు వీ కట్ అండర్​వేర్ వేసుకుంటే మంచిదా? బాక్సర్ వేసుకుంటే మంచిదా?


వీ కట్ అండర్​వేర్ వేసుకుంటే.. 


V-cut అండర్​వేర్​ వేసుకోవడం వల్ల లోపలి తొడ భాగంపై ప్రెజర్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా గాలి ప్రసరణ కూడా తక్కువగా ఉంటుందట. దీనివల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువై చెమట ఎక్కువగా పడుతుందట. చెమటవల్ల ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. Jock Itch వంటి ఇన్​ఫెక్షన్లు వస్తాయట. 


బాక్సర్ అండర్​వేర్ వేసుకుంటే.. 


బాక్సర్స్ సాధారణంగా లూజ్ ఫిట్టింగ్​తో ఉంటాయి. వీటిని వేసుకుంటే తొడ భాగంపై ప్రెజర్ పడకుండా.. గాలి అందేలా చేస్తాయి. దీనివల్ల ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. 


రెండిటీలో ఏది మంచిది..


వీ కట్ అండర్​వేర్​ వల్ల ఫెర్టిలిటీ సమస్యలు ఉండకపోవచ్చు కానీ.. లైంగిక చర్యల సమయంలో ఇబ్బంది పడేలా చేస్తుందట. పైగా వేడిని పెంచుతుంది కాబట్టి పరోక్షంగా దాని ప్రభావం స్పెర్మ్ కౌంట్​పై పడుతుందట. అందుకే వీలైనంతవరకు వీ కట్ అండర్​వేర్​ వేసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు. ముఖ్యంగా సమ్మర్​లో, వేడి ఎక్కువగా ఉన్న సమయంలో దీని జోలికి వెళ్లకూడదంటున్నారు. బాక్సర్స్​తో ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. గాలి వేసే వెసులుబాటు ఎక్కువగా కాబట్టి గుడ్ స్పెర్మ్ క్వాలిటీకి ఇది హెల్ప్ చేస్తుందంటున్నారు.


Also Read : లోదుస్తుల కోసం ఏ వయసు వారు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలో తెలుసా? అది అయితే అందరికీ బెస్ట్


గుర్తించుకోవాల్సిన విషయాలివే


వీ కట్ అండర్​వేర్ వేసుకున్నా.. బాక్సర్స్ వేసుకున్నా.. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూదని సూచిస్తున్నారు. సాఫ్ట్​ మెటీరియల్, కాటన్ మెటీరియల్ మాత్రమే ఉపయోగించాలంటున్నారు. పాలీస్టర్, సింథటిక్​వి వేసుకోకూడదని చెప్తున్నారు. అలాగే మీకు ఫిట్​గా ఉండే అండర్​వేర్​ని మాత్రమే ఎంచుకోవాలని.. టైట్​గా ఉండేవాటిని ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఉతికిన, శుభ్రంగా ఉన్న అండర్​వేర్​ని మాత్రమే వేసుకోవాలి. రోజూ వాటిని మారుస్తూ ఉండాలి. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియ పెరుగుదల ఉండదు. ఇది లైంగిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 



Also Read : సరైన బ్రా వేసుకోకుంటే క్యాన్సర్ వస్తుందా? బ్రా సైజ్​ని ఎలా తెలుసుకోవాలి? ఏ డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకుంటే బెస్ట్? 







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.