Best Innerwear for Men and Women : లోదుస్తులు. వాడుక భాషలో చెప్పాలంటే బనియన్స్, అండర్​వేర్స్, బ్రా. నిపుణులు చెప్పేది ఏంటంటే.. బయట వేసుకునే దుస్తులు ఎలాంటివి వేసుకున్నా.. లోపల ధరించే ఇన్నర్స్​ విషయంలో కాంప్రిమైజ్​ అవ్వకూడదంటున్నారు. లోపలే ఉంటాయి కదా అని చాలామంది ఇన్నర్​వేర్​పై అంతగా శ్రద్ధ వహించరు. తక్కువ ధరకు వచ్చేవాటిని, క్వాలిటీ లేని వాటిని ఎంచుకుంటారు. ఇలా చేస్తే పలురకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వయసు ప్రకారం కొన్నిరకాల లో దుస్తులను మీ వార్డ్​రోబ్​లో చేర్చుకోవాలంటున్నారు. అయితే ఏ వయసువారు ఏ ఫ్యాబ్రిక్ వాడితే మంచిదో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో? ఎలాంటివి ఎంచుకుంటే ఇబ్బందులు రావో ఇప్పుడు తెలుసుకుందాం. 


రెండేళ్లలోపు వారికి..


అప్పుడే పుట్టిన పిల్లలకు స్కిన్ సెన్సిటివ్​గా ఉంటుంది. కాబట్టి వారికి కాటన్, వెదురు దుస్తులు లేదా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ ఇన్నర్స్ వాడితే మంచిది. ఇది స్కిన్​పై మృదువుగా ఉంటుంది. ఇరిటేషన్, ఇబ్బందిని కలిగించదు. 


2-5 ఏళ్ల వారికి.. 


2 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో పెరుగుదల, మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కంఫర్ట్​బుల్, స్ట్రెచ్​ అయ్యే ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. కాటన్, పాలిస్టర్, స్పన్​డెక్స్ బ్లెండ్స్ దుస్తులు పిల్లలకు ఇబ్బంది లేకుండా మూమెంట్స్​కు ఆటంకం కలగకుండా హెల్ప్ చేస్తాయి. స్నాప్ బటన్స్, జిప్ డిజైన్స్ ఉండే లో దుస్తులు మంచిది. 


5 నుంచి 12 ఏళ్లవారికి 


బ్రీతబుల్, మాయిశ్చర్​ విక్కింగ్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. అంటే కాటన్, పాలిస్టర్, నైలాన్ వంటివి చర్మాన్ని డ్రైగా, కంఫర్టబుల్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. నడుము దగ్గర వైడ్​గా వచ్చే లో దుస్తులను ఎంచుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్, గాలి ఆడేందుకు అనువుగా ఉంటాయి. 


13 నుంచి 19 ఏళ్లవారు


తేమను దూరం చేసే కాటన్, పాలీస్టర్, నైలన్ ఫ్యాబ్రిక్స్​ను ఎంచుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్స్ ఇన్నర్​వేర్​ను ట్రెండీ డిజైన్స్​లో తీసుకోవచ్చు. వీటిని తీసుకునే ముందు కచ్చితంగా ట్రైల్ వేసుకోవాలి. సపోర్టివ్​గా, ఫిట్​గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 


20 నుంచి 39 ఏళ్లవరకు 


ఈ వయసువారు హై క్వాలిటీ, గాలి బాగా ఆడే ఫ్యాబ్రిక్స్​ను ఎంచుకోవాలి. కాటన్, వెదురు ఫ్యాబ్రిక్, సిల్క్​ క్లాత్​లను ఎంచుకోవచ్చు. నడుము దగ్గర వైడ్​గా ఉండే సాఫ్ట్​ ఫ్యాబ్రిక్స్, ఫోర్​ వే స్ట్రెచ్​ చేయగలిగే ఫ్యాబ్రిక్స్​ను లో దుస్తులుగా ఎంచుకోవాలి.


Also Read : సరైన బ్రా వేసుకోకుంటే క్యాన్సర్ వస్తుందా? బ్రా సైజ్​ని ఎలా తెలుసుకోవాలి? ఏ డ్రెస్​కి ఎలాంటి బ్రా వేసుకుంటే బెస్ట్? 


40 నుంచి 64 ఏళ్లవరకు 


కాటన్, పాలిస్టర్, నైలాన్ వంటి కంఫర్ట్​నిచ్చే ఇన్నర్​వేర్​ను ఎంచుకోవాలి. సపోర్టివ్​గా, రిలాక్స్డ్​గా ఉంచే డిజైన్స్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. 


65 దాటితే.. 


చర్మానికి ఇబ్బంది కలిగించని ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. కాటన్, వెదురు ఫ్యాబ్రిక్, సిల్క్ వంటివి స్కిన్​కు ఇబ్బంది కలిగించవు. ఇలాంటి ఇన్నర్స్ ఎంచుకుంటే ఈజీగా వేసుకోగలిగే వాటిని మాత్రమే తీసుకోవాలి. 


మీరు సరిగ్గా గమనిస్తే అన్నింట్లోనూ కామన్​గా కాటన్ ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్స్​ను లోదుస్తులుగా ఉపయోగిస్తే గాలి మంచిగా ఆడుతుంది. అలాగే లోపల చెమట వంటివి పట్టినా.. ప్రైవేట్ పార్ట్స్​కి ఇబ్బంది కలగించకుండా చెమటను ఇది అబ్జార్వ్ చేస్తుంది. దీనివల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. 



Also Read : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే