Blood Pressure : బ్లడ్ ప్రెజర్ అనేది ధమనుల గోడలపై రక్తాన్ని నెట్టడం వల్ల గుండె దానిని తీసుకుని.. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ ప్రెజర్ అనేది గుండెకు ఎంత వేగంగా రక్తాన్ని పంపిస్తుందో తెలిపే మెజర్​. దానిని సాధారణంగా  120/80తో కొలుస్తారు. ఈ రీడింగ్​తో ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ ఉంటారు. ఈ ప్రెజర్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. 


బీపీని ఎలా తెలుసుకోవాలి?


బీపీని కొలిచే పరికరంలో 120/80 రీడింగ్​తో బీపీని కొలుస్తారు. ఈ పరికరంలో రెండూ మిల్లీమీటర్ల పాదరసం ఉంటుంది. దీనిని mm Hg అనే యూనిట్లతో కొలుస్తారు. గుండె సంకోచించిన ప్రతిసారీ.. దానిని సిస్టోలిక్ పీడనంగా గుర్తిస్తారు. అంటే ఇది పెద్ద సంఖ్య 120ని సూచిస్తుంది. 80ని డయాస్టోలిక్ పీడనంగా చెప్తారు. గుండె సడలించినప్పుడు కలిగే ఒత్తిడిని ఇది సూచిస్తుంది. ఈ కొలతల్లో అటుగా, ఇటుగా వచ్చే రీడింగ్​ని బట్టి బీపీ ఎంత ఉందనేది తెలుస్తుంది. 


వయసు, జెండర్ ఆధారంగా ఈ రక్తపోటును పరిధిలోకి తీసుకుంటారు. సాధారణంగా రక్తపోటు అనేది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. మీ మెడికల్ కండీషన్​ని బట్టి.. మీ బ్లడ్ ప్రెజర్ ఎంత ఉండాలో వైద్యులు సూచిస్తారు. మీ రక్తపోటు మీ వయసును ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. బీపీని నివారించుకునేందుకు వయసు ప్రకారం ఎంత రక్తపోటు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలంటే..



  • నవజాత శిశువులకు (0-1 నెల) : 60-90/20-60 mmHg ఉండొచ్చు.

  • శిశువులకు : 87-105/53-66 mmHg

  • పసిపిల్లలకు : 95-105/53-66 mmHg

  • ప్రీస్కూలర్లుకు: 95-110/56-70 mmHg

  • స్కూల్​ పిల్లలకు: 97-112/57-71 mmHg

  • కౌమారదశలో ఉన్నవారికి: 112-128/66-80 mmHg ఉంటుంది. కాబట్టి.. ఈ రీడింగ్స్​ని చూసి కంగారు పడకూడదు. 


పెద్దలకు ఎలా ఉండాలంటే.. 


వయసు పెరిగే కొద్ది.. ఆడ, మగలలో ఈ రక్తపోటు డిఫెరెంట్​గా ఉంటుంది. 18 నుంచి 39 సంవత్సరాలు ఉండే మహిళలకు 110/68 mmHg, పురుషులకు 119/70 mmHg అనేది ఉంటుంది. 40 నుంచి 59 సంవత్సరాలు ఉండే మహిళలకు 122/74 mmHg ఉంటే పురుషులకు 124/77 mmHg ఉంటుంది. 60 దాటిన మహిళల్లో 139/68 mmHg ఉండాలి. పురుషులకు 133/69 mmHg. ఈ కొలతలకు కాస్త అటూ ఇటూ వచ్చినా మీ బీపీ సాధారణంగానే ఉందని అర్థం. 



ఇవి కేవలం సాధారణ కొలతలు మాత్రమే. మీ బీపీపై అంచనా ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. బీపీ అనేది వ్యక్తిగత కారకాలపై ఆధారపడి ఉంటుంది. కొందరిలో ఇది ఆందోళన కలిగిస్తుంది. లో బీపీ రెగ్యూలర్​గా ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి. అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్. ఇది ఎక్కువ కాలం ఉంటే.. అది గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫైల్యూర్, కిడ్నీల వ్యాధులు వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్యులు సూచించే మందులు తీసుకుంటూ లైఫ్​స్టైల్​లో మార్పులు చేయాలి. 



Also Read : మధుమేహమున్నవారు అన్నాన్ని అలా తింటే బ్లడ్​లో షుగర్ లెవెల్స్ పెరగవట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.