Deepawali 2024 Wishes : సాధారణ రోజుల్లో ఎలా ఉన్నా.. పండుగల సమయంలో, స్పెషల్​ రోజుల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీమెంబర్స్ మెసేజ్​లు చేస్తూ ఉంటారు. మీరు కూడా వారికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ దీపావళికి మీరు వారికి స్పెషల్​గా సోషల్ మీడియాలో విష్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దీపావళి 2024 శుభాకాంక్షలను తెలుగులో(Deepwali Wishes in Telugu) చెప్పవచ్చు. కోట్స్, మెసేజ్​ల రూపంలో వారికి విషెష్​ చెప్పవచ్చు. పండుగ సమయంలో కుటుంబ సభ్యుందరికీ వీటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ విష్ చేసేయొచ్చు.


దీపావళి 2024 విషెష్ చెప్పేయండిలా.. 



  • ఈ  దీపావళి ప్రేమ, కాంతి, నవ్వులతో నిండాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి. ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును నింపాలని కోరుకుంటున్నాను.

  • ఈ దీపావళి మీరు వెళ్లే మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని.. విజయాన్ని మీకు అందించాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.

  • దీపావళి సమయంలో అమ్మవారు మీకు శాంతి, ఆనందం, విజయాన్ని అందించాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.

  • పండుగ సమయంలో మీరు వెలిగించే దీపాలు కాంతి మీ ప్రయాణంలో తోడు ఉండాలని.. మీ గోల్స్​ని రీచ్​ అయ్యేలా చేయాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.

  • మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఆ దీపాలు మీ జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • నువ్వే నా జీవితానికి లైట్​. ఈ దీపావళి సమయంలో మనం ఇద్దరూ ఒకరికొకరు వెలుగూ నీడలా తోడు ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి.

  • ఈ దీపావళి మీ వ్యాపారంలో ఎనలేని విజయాలను అందించాలని కోరుకుంటూ.. భగవంతుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి.




  • ప్రతి దీపావళిలాగే.. ఈ దీపావళి కూడా మనకి ఎంతో స్పెషల్ కానుంది. త్వరలోనే మీకో గుడ్ న్యూస్ చెప్తాను. హ్యాపీ దీపావళి.

  • మీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత నాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి.

  • దీపావళి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు చెప్తున్నాను. మీ డ్రీమ్స్ ఈ పండుగతో నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.

  • మీ జీవితంలో కొత్త అవకాశాలు రావాలని.. మరింత సమృద్ధిగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.

  • మంచి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు మీకు రావాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి 2024.

  • ఈ దీపావళికి మీ జీవితంలో చెడు అనే చీకటి తొలగిపోయి.. కాంతివంతంగా మారాలని విష్ చేస్తూ హ్యాపీ దీపావళి. 



పండుగ సమయంలో మీరు ఫ్రెండ్, ఫ్యామిలీకి ఇలా విషెష్ చెప్పవచ్చు. అలాగే వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్లలో కూడా వీటిని పోస్ట్ చేయవచ్చు. అచ్చమైన తెలుగులో దీపావళి 2024 శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఈ విషెష్ మీకు కచ్చితంగా హెల్ప్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ కోట్స్, శుభాకాంక్షలను సేవ్ చేసుకుని.. వాటిని మీరు దీపావళికి ఉపయోగించుకోవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా హ్యాపీ దీపావళి 2024. 


Also Read : దీపావళికి ఇంటిని శుభ్రం చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..