Diwali 2024 Cleaning Tips : దీపావళి 2024 మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. అయితే ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మనతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా, అందంగా ఉంటే పండుగ శోభ ఇట్టే వచ్చేస్తుంది. ఇప్పటికే చాలామంది ఇల్లు దులపడం వంటివి ప్రారంభించే ఉంటారు. అయితే పండుగ వచ్చే ముందు క్లీన్ చేసుకునేవాళ్లు కూడా ఉంటారు. ఇంటిని క్లీన్ చేయడమనేది చాలా పెద్ద టాస్క్. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇంటిని చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలా అంటే.. 


ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. (Diwali 2024 cleaning dos)


ఇంటిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏమేమి క్లీన్ చేయాలో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు అన్ని గజిబిజిగా కాకుండా ప్లానింగ్​తో ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఏమి చేయాలి.. ఏమి చేయనవసరం లేదు.. ఏమి కొనాలి.. ఏవి మళ్లీ రీ యూజ్ చేయవచ్చో లిస్ట్ తయారు చేసుకుంటే పని ఈజీ అయిపోతుంది. 


ఓ రూమ్​ని శుభ్రం చేయాలనుకుంటే సగం, సగం కాకుండా.. పూర్తిగా ఒకేసారి కంప్లీట్ చేయండి. దీనివల్ల మీరు మళ్లీ ఆ రూమ్​ జోలికి పోవాల్సిన అవసరం రాదు. పైగా సగం.. సగం చేస్తే.. డస్ట్ క్లీన్ చేసిన వాటిపైకి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా ఒకేసారి శుభ్రం చేసుకుంటే మంచిది. 


పండుగ సమయంలో మీరు కచ్చితంగా చేసుకోవాల్సిన పనుల్లో వార్డ్ రోబ్ క్లీనింగ్ కూడా ఒకటి. ఇది చేయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి. మీ దగ్గర ఎలాంటి డ్రెస్​లు, జ్యూవెలరీ ఉన్నాయో తెలుస్తుంది. వాటిని మీరు ఆర్గనైజ్​గా పెట్టుకోవచ్చు. పండుగ సమయంలో ముస్తాబు కావడాన్ని ఇది మరీ సులభం చేస్తుంది. పైగా కొందరు బట్టలు కొని ఉపయోగించడం మరిచిపోతారు. కాబట్టి ఇలా వార్డ్ రోబ్ సెట్ చేసుకుంటే కొత్త బట్టలు.. లేదా కలర్​ఫుల్ డ్రెస్​లు మీ కంట పడే అవకాశముంది. 


క్లీనింగ్..


ఇంటిని క్లీన్ చేయాలనుకుంటే ముఖ్యంగా విండోలు, గ్రిల్స్​ని చేయాలి. ఎందుకంటే వాటికే ఎక్కువ దుమ్ము ఉండే అవకాశముంది. వీటిని బాగా క్లీన్ చేసుకుంటే.. దీపాలు వెలిగించుకోవడం.. లైట్స్ సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. పైగా క్లీన్ చేయడం వల్ల లైట్స్ పడినా మంచి లుక్​ వస్తుంది. 


కిచెన్.. 


పండుగల సమయం అయినా కాకునా కిచెన్​ని నీట్​గా పెట్టుకోవాలి. చిమ్నీలు, టైల్స్, క్యాబినేట్స్ కడుక్కుంటే మంచిది. అలాగే ఫ్రిడ్జ్​ని కూడా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే పిండి వంటలు చేసేప్పుడు.. చేసిన తర్వాత స్టౌవ్​ని, క్యాబినేట్​ని శుభ్రం చేసుకుంటే పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. 



ఇవి చేయొద్దు.. .. (Diwali 2024 cleaning don'ts)


ఇంటిని శుభ్రం చేయాలనుకుంటే ఎప్పుడైనా ముందుగా ఫ్లోర్​ని శుభ్రం చేయకూడదు. ఇల్లు దులిపి.. అల్మారాలు అన్ని సర్దుకుని డస్ట్​ని శుభ్రం చేసిన తర్వాత ఫ్లోర్​ని క్లీన్ చేయాలి. అప్పుడే ఎలాంటి డస్ట్ లేకుండా ఫ్లోర్ కూడా శుభ్రంగా ఉంటుంది. లేదంటే మీరు ముందే క్లీన్ చేస్తే.. మిగిలిన చెత్త అంతా దానిపై పడిపోతుంది. 


ఏ క్లాత్​ పడితే వాటితో శుభ్రం చేస్తే డస్ట్ అంత శుభ్రంగా వదలదు. కాబట్టి మైక్రోఫైబర్ క్లాత్స్​ని ఉపయోగిస్తే దుమ్ము, డస్ట్​ను శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే శుభ్రం చేసిన తర్వాత చెత్తను బయటపడేయండి. వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచుకుంటే మళ్లీ దుమ్ము లోపలికి వచ్చే అవకాశముంది. 


ఈ టిప్స్ ఫాలో అయ్యి.. ఇంటిని శుభ్రం చేసుకుంటే దీపావళికి ఇళ్లు అందంగా మెరిసిపోతుంది. ఇప్పుడే కాకుండా మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వీటిని ఫాలో అయితే చాలా మంచిది. 



Also Read : దీపావళి సమయంలో లేడీస్​కి ఈ డ్రెస్​లు బెస్ట్.. మగవారు ఈ ట్రెండ్స్ ట్రై చేయొచ్చు