Diwali 2024 Fashion Tips : దీపావళి సమయంలో రంగు రంగుల దీపాలు, ముగ్గుల మధ్య మీరు కూడా అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే మీ దీపావళి షాపింగ్ ఇప్పుడే మొదలుపెట్టేయండి. అక్టోబర్ 30 అయినా.. నవంబర్ 1వ తేదీ అయినా.. దీపావళి ఎప్పుడైనా సరే పండుగ సమయానికి సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడే షాపింగ్ చేసేస్తే మంచిది. ఎందుకంటే ఈలోపు ఫిట్టింగ్​ అయినా.. స్ట్రిచ్ చేయించుకోవాలన్నా గ్యాప్ దొరుకుతుంది కాబట్టి.. పండుగ సమయానికి అన్ని సిద్ధం చేసేసుకోవచ్చు. 


పండుగల సమయంలో ట్రెడీషనల్​గానే కాకుండా ట్రెండీ గానూ.. ఫ్యాషన్​గానూ ఉండే దుస్తులను ఎంచుకుంటే మంచిది. అయితే ఈ దీపావళికి ఆడవాళ్లు ఎలాంటి డ్రెస్​లు వేసుకుంటే బాగుంటుందో.. మగవారికి ఏవి నప్పుతాయో.. డ్రెస్​లను గిఫ్ట్​గా ఇవ్వాలంటే ఏవి బెస్టో ఇప్పుడు చూసేద్దాం. ఏ డ్రెస్​లు దీపావళి శోభను పెంచుతాయో.. మిమ్మల్ని అందంగా కనిపించేలా చేసే దుస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆడవారికి.. (Women's Fashion Trends)


చీరలు : పండుగల సమయంలో ఆడవారికి డ్రెస్​ల విషయంలో ప్రధానంగా ఉండే ఆప్షన్​లలో చీర ఉంటుంది. అయితే మీరు జార్జెట్, సిల్క్, ఆర్గాంజా చీరలను దీపావళికి కట్టుకోవచ్చు. ట్రెడీషనల్ డిజైన్ ఉన్న చీరలను.. ట్రెండీ బ్లౌజ్​లతో సెట్ చేసుకోవచ్చు. లేదా మిర్రర్ వర్క్, అంబ్రాయిడరీ వేయించుకుని మీ శారీ లుక్​ని ట్రెండీగా మార్చుకోవచ్చు. 


అనార్కలీ డ్రెస్​లు : అమ్మాయిలు ట్రెడీషనల్​గా రెడీ అవ్వాలనుకుంటే వారి లిస్ట్​లో కచ్చితంగా అనార్కలీ డ్రెస్​లు ఉంటాయి. ఎందుకుంటే ఇవి మంచి లుక్​ని ఇవ్వడంతో పాటు.. కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. దీపావళి సమయంలో ఇవి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 


లెహంగా : దీపావళి సమయంలో డ్యాన్స్ చేసేందుకు అయినా.. లేదా గ్రాండ్​గా కనిపించాలనుకున్నా లెహంగాలు మంచి ఆప్షన్. హెవీ వర్క్ ఉన్న మిర్రర్ స్టోన్స్ వచ్చిన లెహంగాలు పండుగ శోభను రెట్టింపు చేస్తాయి. అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తాయి. 


పలాజో : కంఫర్ట్​బుల్​గా, స్టైలిష్​గా, సింపుల్​గా ఉండాలనుకునేవారికి ఇవి మంచి ఎంపిక. పైగా వీటిని మీరు డైలీ వేర్​గా కూడా ఉపయోగించుకోవచ్చు. సింపుల్​గా, ఎలిగెంట్​గా కనిపించాలనుకునేవారికి ఇది చాలా మంచి ఆప్షన్. 


టిప్ : డ్రెస్​లు తీసుకునేప్పుడు దానికి మ్యాచింగ్ జ్యూవెలరీ తీసేసుకుంటే పండుగ సమయానికి హడావుడి లేకుండా త్వరగా రెడీ అయిపోవచ్చు. 



మగవారికి.. (Men's Fashion Trends)


కుర్తా పైజామా : మగవారు పండుగల సమయంలో ప్యాంటు, షర్ట్​లకు బదులు కుర్తా పైజామా వేసుకోవచ్చు. ఇవి చాలా కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. పైగా పండుగ శోభను ఇస్తాయి. 


షేర్వాణి : పార్టీలు, ఫంక్షన్ల తరహాలో దీపావళిని చేసుకోవాలనుకుంటే మీరు షేర్వాణిలు ట్రై చేయవచ్చు. ఇవి మంచి గ్రాండ్ లుక్​ని ఇస్తాయి. 


గిఫ్ట్​లు ఇచ్చేందుకు.. (Gift Ideas)


దీపావళి సమయంలో చాలామంది గిఫ్ట్​లు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే మీరు డ్రెస్​లను కూడా దీపావళి గిఫ్ట్​లుగా ఇవ్చొచ్చు. పటోలా ప్రిటెండ్​ శారీలను ఆడవారికి గిఫ్ట్ చేయవచ్చు. ఓవెన్ ఆర్ట్ సిల్క్ శారీలు కూడా మంచి ఆప్షన్. కుర్తా సెట్స్​, ఓవెన్ దుపట్టాలు మగవారికి ట్రెడీషనల్​ లుక్​ కోసం గిఫ్ట్​గా తీసుకోవచ్చు. మోడ్రన్ జ్యూవెలరీని వారికి గిఫ్ట్​గా ఇవ్చొచ్చు. 



Also Read : దీపావళి షాపింగ్​ను ఇలా ఈజీగా చేసేయండి.. ఇలా షార్ట్ లిస్ట్ చేసుకుంటే సరి