దేశంలో ఎక్కువ మందిని పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్. ఇది మూడు రకాలు టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భధారణ సమయంలో వచ్చేది). ఇప్పటి వరకు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచే మందులను కనిపెట్టగలిగారు కానీ, శాశ్వత నివారణను కనిపెట్టలేకపోయారు. కాకపోతే వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్ ఉంచుకోవచ్చు. అది కంట్రోల్ తప్పితే అనేక రకాల వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయి. 


1. రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువై హై బ్లడ్ షుగర్ కు గురైన వారిలో పాదాల సమస్యలు మొదలుతాయి. తీవ్రమైన పరిస్థితుల్లో పాదాల్ని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. గాయాలు, అల్సర్లు వంటివి కలిగి ఒకంతట తగ్గవు. 
2. కంటి చూపు సమస్యలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హఠాత్తుగా బ్లడ్ షుగర్ పెరగడం వల్ల చూపు మసకబారడం, కాటరాక్ట్, గ్లకోమా వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. 
3. చర్మ ఇన్ఫెక్షన్, ఆడవాళ్లలో అయితే వెజినల్ ఇన్షెక్షన్ కూడా కలుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ల కారణంగా శరీరం ఒత్తిడికి గురై కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లను స్రవిస్తుంది. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఇంకా పెరుగుతుంది. 
4. రక్తంలో అధిక చక్కెర స్థాయులు నాడీ వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తాయి. జుట్టురాలడం, పాదాలు చల్లబడిపోవడం వంటివి కలుగుతాయి. 
5. అధిక షుగర్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. శరీరానికి అయ్యే గాయాలు అంత  త్వరగా మానవు. ఏదైనా తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇది మానసిక వేదనకు గురిచేస్తుంది. 
6. డయాబెటిస్ రోగులకు మలబద్ధకం, డయేరియా వంటివి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు అసాధారణంగా ఎక్కువవుతుంటే... ఈ సమస్యలు దీర్ఘకాలికంగా కలుగుతాయి. 


డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలున్న ఆహారం తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజుతినే ఆహారంలో అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. తక్కువ కెలోరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు ఎంచుకోవాలి. అయితే వీరు అన్నిరకాల పండ్లు, ఆహారాలు తినకూడదు. ఈ విషయంలో వైద్యుడిని అడిగి సలహాలు తీసుకోవడం ఉత్తమం. 


టమోటాలు, అవిసె గింజలు, ఒమేగా 3 ఆమ్లాలుండే నట్స్, మెంతులు, జామకాయలు, బార్లీ, ఓట్స్, గుమ్మడి గింజలు, బీట్ రూట్ వంటివి తింటే వారికి మంచిది. 


Also read: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...


Also read: పిల్లలకు రోజుకో అరస్పూను నెయ్యి తినిపించండి... మతిమరుపు దరిచేరదు


Also read: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...