పొట్టలో గడబిడగా ఉంటేనే తట్టుకోలేం. కానీ ఓ వ్యక్తి ఏకంగా డియోడరెంట్ బాటిల్ మొత్తం పెట్టుకుని ఇరవై రోజులు ఉన్నాడు. ఆయనకు తన పొట్టలో డియోడరెంట్ బాటిల్ ఉందని తెలిసి కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా అలానే ఇంట్లో ఉన్నాడు.ఆ ఇరవై రోజులు మల విసర్జన జరగక తీవ్ర అనారోగ్యం పాలవ్వడమంతో చివరికి ఆసుపత్రిలో చేరాడు. పొట్ట స్కాన్ తీసి చూసిన వైద్యులు షాక్ తిన్నారు. అంత బాటిల్ పొట్టలో పెట్టుకుని అన్ని రోజులు ఎలా ఉన్నాడో తెలియక షాక్ తిన్నారు. 


ఆ యువకుడిది కోల్ కతా. వయసు 27 ఏళ్లు. ఆ బాటిల్ ఎందుకు పొట్టలోకి వెళ్లిందో, ఎవరు అలా చేశారో చెప్పడానికి ఆ యువకుడు నిరాకరించాడు. కాకపోతే పురీషనాళం ద్వారానే అది పొట్టలోకి చేరినట్టు చెప్పాడు. 20 రోజుల పాటూ ఆహారం సరిగా తినకుండా, మల విసర్జన చేయకుండా ఉండడంతో తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బాటిల్ ను బయటికి తీశారు వైద్యులు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడిని వారం పాటూ అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పారు వైద్యులు. 


దాదాపు ఏడున్నర అంగుళాల బాటిల్ మూతతో సహా లోపల పొట్టలో ఉంది. దాన్ని తీయడానికి వైద్యులు దాదాపు రెండు గంటల పాటూ ఆపరేషన్ చేశారు. దీని వల్ల ఆ యువకుడి అన్నవాహిక కూడా దెబ్బతింది. దీంతో దానికి కూడా సర్జరీ చేసి సరిచేశారు వైద్యులు. పేగులు దెబ్బతిన్నట్టు గుర్తించారు. కాకపోతే వాటికి ఇప్పడు సర్జరీ చేయలేదు. పేగులకు భవిష్యత్తులో సర్జరీ అవసరం అవుతుందని చెప్పారు వైద్యులు. 


పొట్టలో బాటిల్ ఉందని తెలిసి కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించకపోవడం వల్లే అతడు సమస్యను పెరిగిపోయేలా చేసుకున్నాడు. వెంటనే వెళ్లి ఉంటే పేగులు, అన్నవాహిక పాడవకుండా ఉండేవి. అతను ఇలాగే ఉంటే మరికొన్ని రోజుల్లో మరణించేవాడని అన్నారు వైద్యులు. వారు మాట్లాడుతూ ‘ఇది మాకు చాలా ఛాలెంజింగ్ కేసు. అతడిని జాగ్రత్తగా చూసుకున్నాము. సర్జరీ కూడా చాలా జాగ్రత్తగా చేశాము’ అని చెప్పారు. ఇంకా అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక రోగి కుటుంబసభ్యులు మాట్లాడుతూ సర్జరీ విజయవంతం కావడంతో తాము ఆనందంగా ఉన్నామని, అతనికి ఏమవుతుందోనన్న భయం తగ్గిందని చెప్పారు. 


ఇలా వస్తువులు అనుకోకుండా పొట్టలోకి చేరినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించమని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఆలస్యం అవుతున్న కొద్దీ ముప్పు పెరుగుతుందని, ఒక్కోసారి పరిస్థితులు చేయి దాటిపోతాయని అన్నారు. పొట్ట చాలా సున్నితమైన ప్రాంతమని, పొట్టలోని పేగుల్లో సమస్య మొదలైతే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు.


Also read: రోజుకు 10,000 అడుగులు వేస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు, మొదలుపెట్టండి మరి


Also read: జాక్ అంటే ఎవరు? పనసపండు పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా


Also read: గుడ్లగూబల్లో ఓ పిల్లి దాక్కుంది, మీకు కనిపించిందా? అర సెకనులో కనిపెట్టండి చూద్దాం