వానాకాలంలో డెంగ్యూ కేసులు అధికంగా వస్తాయి. ఎందుకంటే వానాకాలంలోనే దోమలు గుడ్లు పొదిగే సమయం. అవి విపరీతంగా తమ సంఖ్యను పెంచుకుంటాయి. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలను మోసుకెళ్తాయి. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ ఎక్కువగా పేద ప్రజల్ని టార్గెట్ చేస్తోంది. ఎందుకంటే వారి చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణమే అధికంగా ఉంటుంది. అయితే డెంగ్యూ గర్భిణీ స్త్రీలకు వస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ప్రసవం ముందుగా కావడం లేదా బిడ్డ గర్భంలోనే మరణించడం వంటి సమస్యలు వస్తాయి.


గర్భధారణ సమయంలో... గర్భంలో పెరుగుతున్న పిండానికి మద్దతుగా రోగ నిరోధక వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది. దీనివల్ల గర్భిణీలు డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లకు త్వరగా లోనవుతారు. గర్భధారణ సమయంలో హార్మోన్లు కూడా మార్పులు అధికంగా చెందుతాయి. దీనివల్ల వ్యాధులు సులభంగా సోకుతాయి. గర్భధారణ సమయంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ తల్లీ బిడ్డ ఇద్దరికీ సోకే అవకాశం ఉంది. దీనివల్ల బిడ్డ చాలా ప్రభావితం అవుతుంది. తక్కువ బరువుతో పుట్టడం లేదా నెలలు నిండకుండా జన్మించడం, గర్భంలోనే మరణించడం వంటివి జరుగుతాయి. కాబట్టి గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.


గర్భిణీలు ముందుగానే డెంగ్యూ రాకుండా జాగ్రత్తపడాలి. ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి. శరీరమంతా కప్పేలా దుస్తులు వేసుకోవాలి. దోమతెరలను వినియోగిస్తూ ఉండాలి. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కిటికీలు ఎప్పుడు వేసే ఉంచుకోవాలి. జ్వరం వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను అధికంగా తినాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు కచ్చితంగా తినాలి. వైద్యులు ఇచ్చిన మందులు కచ్చితంగా వేసుకోవాలి. 


డెంగ్యూ సోకాక మాత్రం కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తినాలి. కొబ్బరినీళ్లు తాగుతూనే ఉండాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో ఖనిజాలు లోపించకుండా ఉంటుంది. ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత రాకుండా కొబ్బరినీళ్లు అడ్డుకుంటాయి. అలాగే కప్పు పెరుగు కచ్చితంగా తినాలి. ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ కప్పు దానిమ్మ గింజలు తింటూనే ఉండాలి. సాధారణ టీ, కాఫీలను తాగకూడదు. హెర్బల్ టీలు తాగుతూ ఉండాలి. నూనె నిండిన ఆహారాలు, కారం నిండిన ఆహారాలు తక్కువగా తినాలి. పూర్తిగా తినడం మానేసినా మంచిదే. వీధుల్లో ఉండే ఆహారాలను తినకుండా ఉండాలి. కెఫీన్ అధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. 


Also read: బ్లాక్ ప్లాస్టిక్ బాక్స్‌లో రెస్టారెంట్లలో ఆహారాన్ని అందిస్తున్నారా? ఆ నల్ల ప్లాస్టిక్ ఎంతో హానికరం


Also read: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దీన్ని తినకపోతేనే ఆరోగ్యం



























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.