Stock Market Today, 09 August 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 41 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్ కలర్‌లో 19,601 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: టాటా పవర్, బెర్జర్ పెయింట్స్, IRCTC, ZEE, మాక్స్ ఫైనాన్షియల్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఐనాక్స్ విండ్: ప్రమోటర్ కంపెనీలు ఐనాక్స్ విండ్ ఎనర్జీ & దేవాన్ష్ ట్రేడ్‌మార్ట్, ఐనాక్స్ విండ్‌లో తమ వాటాలు తగ్గించుకున్నాయి. బ్లాక్ డీల్స్ ద్వారా, వరుసగా 4.5 శాతం & 2.8 శాతం వాటాను సగటున ఒక్కో షేరుకు రూ. 208 చొప్పున అమ్మేశాయి.
360 వన్ వామ్: విదేశీ పెట్టుబడి కంపెనీ జనరల్ అట్లాంటిక్ సింగపూర్, బ్లాక్ డీల్స్ ద్వారా, 360 వన్ వామ్‌లో వాటాను విక్రయించింది. తనకున్న స్టేక్ మొత్తాన్ని దాదాపుగా ఖాళీ చేసింది.
బికాజీ ఫుడ్స్: లైట్‌హౌస్ ఇండియా ఫండ్, బికాజీ ఫుడ్స్‌లో కొంత వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మింది. ప్రముఖ దేశీయ ఫండ్స్ టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రూ లైఫ్, విదేశీ ఇన్వెస్టర్లు మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్ర ఏఎంసీ (సింగపూర్) వంటి సంస్థలు ఆ షేర్లను కొనుగోలు చేశాయి.
కోల్ ఇండియా: ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం 2023 జూన్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన (YoY) 10 శాతం తగ్గి రూ. 7,941 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 3 శాతం పెరిగి రూ. 35,983 కోట్లకు చేరుకుంది.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్: 2023-24 మొదటి త్రైమాసికంలో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 267 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,681 కోట్లుగా ఉంది.
SBI లైఫ్: ఈ కంపెనీ MD & CEO అమిత్ ఝింగ్రాన్ నియామకానికి IRDAI ఆమోదం తెలిపింది.
జెట్ ఎయిర్‌వేస్: Q1 FY24లో జెట్ ఎయిర్‌వేస్ నష్టం రూ. 50.7 కోట్లకు తగ్గింది. కార్యకలాపాల ద్వారా ఈ విమానయాన కంపెనీ రూ. 37.6 కోట్ల ఆదాయం సంపాదించింది.
ఆయిల్ ఇండియా: మంగళవారం మొదటి త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన ఆయిల్ ఇండియా, నికర లాభంలో స్వల్ప వృద్ధిని మాత్రమే సాధించింది. ఈ కంపెనీ ఖర్చులు తగ్గినా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా తగ్గడం వల్ల ఆదాయంలో కూడా తగ్గింది. వచ్చిన లాభం భర్తీ అయింది.
సైమెన్స్: 2023 ఏప్రిల్-జూన్ కాలంలో సైమెన్స్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 52 శాతం పెరిగి రూ. 456 కోట్లకు చేరుకోగా, ఆదాయం 14 శాతం పెరిగి రూ. 4,873 కోట్లకు చేరుకున్నాయి.
డిష్ టీవీ: కంపెనీ సీఈఓగా మనోజ్ దోభాల్‌ను డిష్ టీవీ నియమించింది.
ఇది కూడా చదవండి: అప్పుడు ₹3, ఇప్పుడు ₹83 - ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటివరకు రూపాయి విలువలో ఎన్నో విచిత్రాలు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial