History of the Indian Rupee: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో, ఒక అమెరికన్‌ డాలర్‌తో (USD) భారత రూపాయి (INR) ఎక్సేంజ్‌ రేట్‌ ₹3.30. అప్పటి నుంచి, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతూనే వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి, USD-INR మారకం రేటు ₹82.73.


1949-1966 మధ్య కాలంలో USD-INR ఎక్సేంజ్‌ రేటు ₹4.76. ఆ టైమ్‌ పిరియడ్‌లో సప్లై & డిమాండ్‌తో సంబంధం లేకుండా ఇదే ఫిక్స్‌డ్‌ రేట్‌ కొనసాగింది. 1966-1975 మధ్య కాలంలో USD-INR మారకం రేటు ₹7.50. దీనిని 1975 (₹8.39), 1980 (₹6.61), 1985 (₹12.38), 1990లో (₹17.01) నాలుగు సందర్భాల్లో మళ్లీ మార్చారు. ఫిక్స్‌డ్‌ ఎక్సేంజ్‌ రేట్‌ విధానాన్ని 1993 వరకు ఇండియా కంటిన్యూ చేసింది. 


1993లో, రూపాయికి "మార్కెట్ ఆధారిత మారకం ధర" (market-determined exchange rate) విధానాన్ని ఇండియా ఫాలో అయింది.


ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో, US డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపీ విలువ ₹82.93కి చేరుకుంది, పరమ కనిష్ట స్థాయికి పడిపోయింది.


1947 నుంచి 2023 వరకు ఇండియన్‌ రూపాయి హిస్టరీ:


సంవత్సరం USD/INR మారకం రేటు


1947                  3.3
1949                 4.76
1966                 7.5
1975                 8.39
1980                 7.86
1985                12.38
1990                17.01
1995                 32.42
2000                 43.5
2005 (జనవరి)    43.47
2006 (జనవరి)    45.19
2007 (జనవరి)    39.42
2008 (అక్టోబర్‌)    48.88
2009 (అక్టోబర్‌)    46.37
2010 (జనవరి)     46.21
2011 (ఏప్రిల్‌)     44.17
2011 (సెప్టెంబర్‌) 48.24
2011 (నవంబర్‌) 55.39
2012 (జూన్‌)       57.15
2013 (మే)           54.73
2013 (సెప్టెంబర్‌) 62.92
2014 (మే)          59.44
2014 (సెప్టెంబర్‌) 60.95
2015 (ఏప్రిల్‌)       62.3
2015 (మే)           64.22
2015 (సెప్టెంబర్‌) 65.87
2015 (నవంబర్‌)  66.79
2016 ( జనవరి)    68.01
2016 (జనవరి)     67.63
2016 (ఫిబ్రవరి)    68.82
2016 (ఏప్రిల్‌)      66.56
2016 (సెప్టెంబర్‌) 67.02
2016 (నవంబర్‌) 67.63
2017 (మార్చి)      65.04
2017 (ఏప్రిల్‌)     64.27
2017 (మే)           64.05
2017 (ఆగస్టు)      64.13
2017 (అక్టోబర్‌)    64.94
2018 (మే)            64.8
2018 (అక్టోబర్‌)      74
2019 (అక్టోబర్‌)     70.85
2020 (జనవరి)      70.96
2020 (డిసెంబర్‌)  73.78
2021 (జులై)         74.42
2022 (మే)            77.49
2023 (జనవరి)     81.52
2023 (ఆగస్టు)       82.73


1950ల్లో, భారత రూపాయి నాణేల కోసం దశాంశ వ్యవస్థను (decimalization) తీసుకొచ్చారు. అప్పటి వరకు ఒక రూపాయిని 16 అణాలు, 96 పైసలు, 64 పైసలుగా విభజించారు. డెసిమలైజేషన్‌ నుంచి 1 రూపాయి 100 పైసలుగా మార్చారు.


కాలక్రమేణా, రూపాయి తరహాలోనే అమెరికన్‌ డాలర్‌ కూడా ద్రవ్యోల్బణ ప్రభావానికి గురైంది, బలాన్ని కోల్పోయింది. 1947-2023 మధ్య కాలంలో USD మొత్తంగా 2,981% ద్రవ్యోల్బణానికి గురైంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, 1947లో ఒక డాలర్‌కు వచ్చిన వస్తువు కోసం ఇవాళ $30 పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.


మరో ఆసక్తికర కథనం: సక్సెస్‌ స్కోప్‌ ఉన్న సరికొత్త వ్యాపారాలు గురూ, మీ కోసమే వెయిటింగ్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial