హఠాత్తుగా గుండె ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇలా గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. గుండె జబ్బుల వల్ల గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల, ఎలక్ట్రిక్ షాక్ వల్ల, భయం వల్ల, కొలెస్ట్రాల్ అతిగా పేరుకుపోవడం వల్ల రకరకాల కారణాలతో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎదుట వ్యక్తి గుండె ఆగి పడిపోయినప్పుడు, పక్కవాళ్ళు చేసే ప్రాథమిక చికిత్స ఆ వ్యక్తిని తిరిగి కాపాడే అవకాశం ఉంది. దీన్నే కార్డియో పల్మనరీ రెససిటేషన్ అంటారు. దీన్నే CPR అంటారు. ప్రతి ఒక్కరికి సిపిఆర్ ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులకైనా, స్నేహితులకైనా, రోడ్డు మీద పోయే ఏ వ్యక్తులైనా గుండెపోటుతో పడిపోతే వారికి సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది.


ఎవరికైనా హఠాత్తుగా గుండె ఆగిపోతే... వారి పక్కన ఉన్నవారు మళ్ళీ గుండెను కొట్టుకునేలా చేసే ప్రక్రియ CPR. దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఎదురుగా ఎవరైనా స్పృహ కోల్పోయినట్టు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. గుండెపోటు వల్ల వారు పడిపోతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రెండు భుజాలను పట్టుకుని గట్టిగా ఊపుతూ వారిని లేపడానికి ప్రయత్నించాలి. ఎంతగా ఊపినా వారు లేవకపోతే, వారు ఊపిరి తీసుకుంటున్నారో లేదో గమనించాలి. ఊపిరి తీసుకోకపోతే వెంటనే ఆ వ్యక్తికి గాలి ఆడేలాగా చేయాలి. బిగుతైన దుస్తులు వేసుకుంటే వాటిని విప్పేయాలి. 


పక్కనున్న వారిని 108కి ఫోన్ చేయమని చెప్పాలి. మీరు మోకాళ్ళ మీద కూర్చొని ఆ వ్యక్తి ఛాతీ మీద ఒక చెయ్యి మీద మరొక చెయ్యి పెట్టి ఫోటోలో చూపించిన విధంగా ఒక చేతి వేళ్లతో మరొక చేతి వేళ్లను పట్టుకుని...  ఛాతీ మధ్యలో నొక్కుతూ ఉండాలి.చాలా వేగంగా... మన శరీరం బరువు మొత్తం ఆ చేతి మీద పడేలాగా నొక్కుతూ ఉండాలి. నిమిషానికి కనీసం వంద సార్లు వేగంగా నొక్కాలి. వీటిని చెస్ట్ కంప్రెషన్స్ అంటారు. ఇలా నొక్కడం వల్ల తిరిగి గుండె కొట్టుకునే అవకాశం ఉంది. మధ్యమధ్యలో నోటిలోకి గాలిని ఊదుతూ ఉండాలి. గాలిని ఊదినప్పుడు నోటిలో, నోరు పెట్టడం కష్టం అనుకుంటే... పలుచటి రుమాలు అతని నోటిపై పెట్టి, గట్టిగా గాలి ఊదండి. ఇలా చేసి మళ్లీ గాలి ఊదండి. గుండె కొట్టుకోవడం మొదలై,  ఆయన ఊపిరి తీసుకునే వరకు ఇలా సిపిఆర్ చేయడం అవసరం. కొందరు ఈ సిపిఆర్ ద్వారా తిరిగి కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ లోపు అంబులెన్స్ వస్తే వారు మిగతా జాగ్రత్తలు తీసుకుంటారు.


Also read: సిఫిలిస్, ఇదొక లైంగిక వ్యాధి- దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే


Also read: అమ్మో టమోటాలు, ఒకప్పుడు వీటిని తినాలంటే వణికిపోయేవారు





















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.