త్వరగా వంట పూర్తవ్వాలన్న కారణంగా ఎక్కువ మంది అధిక ఉష్ణోగ్రత వద్ద, పెద్ద మంట పెట్టి ఆహారాన్ని ఉడికిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించడం వల్ల ఆహారంలోనే DNA దెబ్బతింటుంది.  ఆహారం తినే వ్యక్తి శరీరంలో ఉన్న డిఎన్ఏ ని కూడా, ఈ ఆహారంలోని డిఎన్ఏ మార్చే అవకాశం ఉంది. దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా మాంసాహార వంటకాలు, డీప్ ఫ్రై చేసిన వంటకాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వండి,  వాటిని తరచూ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని ఈ పరిశోధన చెబుతుంది.


మన ఆహారంలో ఎక్కువగా మాంసం, పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్, ధాన్యాలు, నట్స్, పుట్టగొడుగులు వంటివి ఉంటాయి. వీటన్నింటిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. అదే ఆ ఉత్పత్తి రంగును, ఆకారాన్ని నిర్ణయిస్తుంది. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువసేపు ఉడికిస్తే ఆ డిఎన్ఏ లో చాలా మార్పులు వస్తాయి. ఆహారం ద్వారా ఆ చెడిపోయిన డిఎన్ఏ మంచి శరీరంలో చేరి తీవ్ర అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఈ డీఎన్ఏ శరీరంలో చేరాక మ్యుటేషన్ చెందుతుంది. ఇవి మనిషి డిఎన్ఏ  చెడగొడుతుంది. అందుకే ఎక్కువ మంట వద్ద వండిన ఆహారాలను తినకూడదని చెబుతోంది అధ్యయనం.


ల్యాబ్ లో ఎలుకలపై చేసిన అధ్యయనం ద్వారా ఈ ఫలితాలను వెల్లడించారు పరిశోధకులు. కాబట్టి వంట చేసే పద్ధతి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని అర్థం చేసుకోవాలి. జన్యుపరమైన మార్పులు అనారోగ్యాలకి కారణమవుతాయి. అందుకే ఆహార తయారీపై దృష్టి సారించాలి. వీలైనంతవరకు చిన్న లేదా మీడియం మంట మీదే ఆహారాన్ని వండడం చాలా ముఖ్యం. డీప్ ఫ్రైలు అధికంగా తినడం మానేయాలి. క్యాన్సర్ కారకాలు శరీరంలో చేరే అవకాశం ఎక్కువ. నీళ్లలో ఉడికించిన ఆహారాన్ని తినడం వల్ల మేలు జరుగుతుంది. అంటే కూరలు, అన్నం వంటివి తినడమే ఆరోగ్యకరం. నేరుగా మంటపై కాల్చిన మొక్కజొన్న పొత్తులు, చపాతీలు వంటివి కూడా తినకూడదు. వీటిలో కూడా క్యాన్సర్ కారకాలు జనిస్తాయి. తాజా ఆకుకూరలు, పండ్లపైన ఆధారపడితే ఆరోగ్యం బాగుంటుంది. ఆధునిక కాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.



Also read: అధికంగా త్రేన్పులు వస్తున్నాయా? ఇలా చేయండి, తగ్గుతాయి


Also read: బాలింతల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వారు పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడినట్టే








































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.