కొత్తగా వంట చేసే వారికి సింపుల్‌గా చికెన్ పలావ్ చేసేయచ్చు. దీన్ని త్వరగా వండేయచ్చు, పైగా సులువుగా అయిపోతుంది. రుచిలో బిర్యానీతో పోటీ పడేలా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా ఇది బాగా నచ్చేస్తుంది. దీన్ని స్పైసీగా వండుకుంటే పెద్ద వాళ్లకు కూడా నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో ఓసారి చూడండి.
కావాల్సిన పదార్థాలుబాస్మతి బియ్యం - ఒక కప్పుచికెన్ - పాలు కిలోలవంగాలు - అయిదుబిర్యానీ ఆకు - రెండుఉల్లిపాయ - ఒకటియాలకులు - నాలుగుషాజీరా - అర స్పూనుదాల్చిన చెక్క - చిన్న ముక్కఅల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూనుపసుపు - పావు స్పూనుకారం - ఒక స్పూనుగరం మసాలా - ఒక స్పూనుఉప్పు - రుచికి సరిపడాటమోటా - ఒకటినీళ్లు - సరిపడాకొత్తి మీర తరుగు - రెండు స్పూన్లుపెరుగు - పావు కప్పుపుదీనా తరుగు - రెండు స్పూన్లుపచ్చిమిర్చి - రెండు
తయారీ ఇలాముందుగా బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆ నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క షాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలను సన్నగా, నిలువుగా తరిగి నూనెలో వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి కలపాలి. తరువాత కారం, పసుపు, గరం మసాలా, టమోటా తరుగు వేసి బాగా కలపాలి. అవి వేగాక చికెన్ ముక్కలను వేయాలి. అయిదు నిమిషాల పాటూ చికెన్ ముక్కలను వేసి ఉడకించాలి.అందులో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి. అలాగే పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తరువాత అరగంట పాటూ వదిలేయండి. తరువాత మూత తీసి కలపాలి. చికెన్ పులావ్ రెడీ అయినట్టే.
చికెన్ పులావ్‌లో మాంసం ముక్కలను నీటిలో ఉడికిస్తాం. కాబట్టి తింటే మంచిదే. ఎందుకంటే చికెన్ వేపుడు కన్నా, ఇలా ఉడికించిన చికెన్ తినడం ఆరోగ్యకరం. నూనెలో వండిన వేయించిన చికెన్ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఉడికించిన తినడమే మంచిది. చికెన్ కర్రీ, బిర్యానీలలో చికెన్ ను నీటిలో ఉడికిస్తే ఎంతో మంచిది. అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. చికెన్ లో ప్రొటీన్ చాలా అవసరం. ఇది ఎముకలకు బలాన్ని అందిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే విటమిన్ బి6, విటమిన్ బి12, జింక్, ఇనుము వంటివి దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.
Also read: ఆ నది నిండా బంగారమే, గుప్పెడు ఇసుకలోను ఎంతో కొంత బంగారం దొరికే ఛాన్స్
Also read: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆయుర్వేద మూలిక ఇదే, పిల్లలకు తినిపిస్తే చదువులో దూసుకెళ్తారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.